వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఏపీకి మాత్రమే పరిమితమైంది. 2014కు ముందు అటు తెంలగాణలోనూ.. ఇటు ఏపీలోనూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జగన్ పార్టీ.. ఆ తర్వాత వన్ సైడ్ అయ్యింది. ఏపీలోనే చురుగ్గా ఉంటూ.. తెలంగాణపై ఆశలు వదిలేసుకుంది. అయితే ఆ పార్టీకి తెలంగాణలో కొంత ఓటు బ్యాంకు ఉండటం విశేషం.

YS JAGAN and kcr కోసం చిత్ర ఫలితం


2014 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఒక ఎంపీ, 3-4 అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంది. కానీ ఆ తర్వాత పార్టీని తెలంగాణలో బలోపేతం చేయలేదు. దీంతో గెలిచినవారు కూడా టీఆర్‌ఎస్‌ లోకి జంప్ అయ్యారు. ఇక 2019లో ఏకంగా వైసీపీ అసలు పోటీకే దిగలేదు. ఇవన్నీ చూస్తే.. తెలంగాణలో వైసీపీ చాప చుట్టేసినట్టే అనుకోవాలి. కానీ జగన్ ప్లాన్ మాత్రం అలా లేదు.

YS JAGAN and kcr కోసం చిత్ర ఫలితం


తెలంగాణలో వైసీపీ కథ ఏమాత్రం ముగియలేదంటున్నారు జగన్. అవును. మీరు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు కదా.. మీ పార్టీ పని తెలంగాణలో క్లోజ్‌ అయినట్టేనా అని అడిగితే.. అవును 2018 వరకూ క్లోజ్ అయినట్టే.. ప్రస్తుతం నా దృష్టి అంతా ఏపీపైనే ఉంది. దేవుడి దయవల్ల ఏపీలో గెలిచి సీఎం అయితే.. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తాం.

YS JAGAN and kcr కోసం చిత్ర ఫలితం


ఏపీలో నేను సీఎం అయితే.. తెలంగాణలో పార్టీపై దృష్టి పెడతా. వచ్చే ఐదేళ్లు గట్టిగా పని చేస్తాం. 2024 నాటికి కేసీఆర్ పాలన పదేళ్లు పూర్తవుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వైసీపీ వైపుకు వచ్చే ఛాన్సుంది. దేవుడు దయదలిస్తే.. తెలంగాణలోనూ మా పార్టీ పరిస్థితి బావుంటుందని తన మాస్టర్ ప్లాన్ బయటపెట్టారు జగన్. మరి ఇదంతా జరిగే పనేనా అంటే.. ఏమో గుర్రం ఎగురావచ్చు.. మనిషి ఆశాజీవి కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: