దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ కు తలొగ్గుతూ అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  స్వాతంత్రం వచ్చి భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా రూపు దిద్దుకొని, తన రాజ్యాంగంలో సామాజిక వెనకబాటుతనంతో కృంగి కృసిస్తున్న అణగారినవర్గాలకు  పదేళ్ళపాటు రిజర్వేషణ్లను అనుమతిచ్చి, రాజ్యాంగంలో అదే పొందుపరచుకుంది. 


అప్పటి నుంచి 22.50 శాతం ఎస్సి-ఎస్టి సామాజిక వర్గాలకు ఇంకొన్ని తరగతులకు రిజర్వేషణ్లను వర్తింపజేస్తూ 50 శాతం శాతానికి పైగా  తీసుకెళ్ళింది.  ఎన్నికల రాజకీయాలతో పెంచుకుంటూ చేసిన ఈ దౌర్భాగ్యం  స్వతంత్రం నాటికి అగ్రవర్ణాలు గా ఉన్నవారు నిరుపేదలై ఆర్ధికంగా అణగారి పోతున్న తరుణంలో,  10 శాతం రిజర్వేషణ్లను అగ్రవర్ణ నిరుపేదలకు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు స్వతంత్రం నాటి నుండి ఏడు దశాబ్ధాలుగా  అణగదొక్క బడిన అగ్రవర్ణ నిరుపేదలకు ఇప్పటి కైనా ఏదోరకంగా సమాజంలో రిజర్వేషన్ రూపంలో ఒక గుర్తింపుదక్కింది. అలాగే ఈ నిర్ణయం ఎన్నికల్లో మోడీకి అంతే స్థాయి లో మేలు కలిగిస్తుందన్న దాంట్లో అతిశయోక్తి లేదు.  



అగ్రకులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు ప్రకటిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం ఆదాయ పరిమితి తో కూడినది. ఈ  రిజర్వేషన్లు  ప్రకటన నిర్ణయం మోదీ సర్కార్ భారీ ఎత్తుగడలో భాగంగానే  తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజగకీయ ఎత్తుగడ గురించి ముందుగానే సమాచారం కొన్ని ప్రసార మాధ్యమాలు వార్తలు ప్రకటించినా అది నిర్ధారణ కాదు కదా! అదే ఇప్పుడు నిజమైంది.
10% reservation to EBCs కోసం చిత్ర ఫలితం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 10  ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది.రిజర్వేషన్లను 50 నుండి 60 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంని రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయించుకుంది.  ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ వర్గాలు మరియు బిసిల రిజర్వేషన్లకు ఏమాత్రం ఆటంకం  కలిగించడం లేదు. ఇలా ఇతర రిజర్వేషన్లకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోటాను ఆగ్రకులాలకు ప్రకటించడం వెనుక రహస్య ఎజెండా దాగివుందని సమాచారం. 


"ప్రస్తుతం అగ్రవర్ణాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వంపై  తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. "ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటి కేసు" ను మరింత కఠినతరంచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వారి కోపానికి కారణమవుతోంది. ఈ చట్టం కింద నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలంటూ వున్న చట్టానికి సుప్రీంకోర్టు కొన్ని పరిమితులు విధించింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అర్డినెన్స్ తీసుకువచ్చి ఈ పరిమితులను తొలగించింది.  


ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు భారత్ బంద్ కు కూడా పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ  అశంపై కొందరు నెటిజన్లయితే సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న బిజెపికి వ్యతిరేకంగా 2019లో నోటాకు ఓటేసి జాతీయ పార్టీలకు బుద్దిచెప్పాలంటూ పిలుపునిచ్చారు.  కేంద్ర ప్రభుత్వం  తాజాగా చేసిన ప్రయోగమే 2016 లో గుజరాత్ లోని బిజెపి ప్రభుత్వం చేపట్టి మంచి ఫలితాలను సాధించింది.  ఇక్కడ 6 లక్షల కంటే తక్కువ వార్షికాధాయయం కలిగిన అగ్రవర్ణ పేదలకు కూడా ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. అయితే రాష్ట్ర హైకోర్టు దీన్ని వ్యతిరేకింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న ప్పటికి  అక్కడా అక్కడి హైకోర్టు కూడా అడ్డుతగిలింది.



ఏదేమైనప్పటికి తాజాగా ప్రకటనతో ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను అందించాలని కేంద్రం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందుకు ఎలాంటి ఆటంకం రాకుండా వుండేందుకు పార్లమెంట్ సాక్షిగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్ కేటగిరీలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణ లను సవరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం  గరిష్ఠ రిజర్వేషణ్ల పరిమితికి అదనంగా ఈ కోటా ప్రతిపాదిస్తు న్నందువల్ల దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును, పార్లమెంటు శీతాకాల సమావేశాలకు చివరి రోజైన ఈ రోజే (మంగళవారం) ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు పలకవలసి ఉంటుంది. ఒకవేళ బిల్లుకు రాజ్యసభలో విపక్షాలు ఆమోదించకపోతే సమాజంలో ప్రభావవంతమైన వర్గం మద్దతును అవి కోల్పోవాల్సి వస్తుందనేది భాజపా విశ్వాసం.



దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ప్రజలను మోసగించేందుకే బీజేపీ ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను తీసుకొచ్చిందనీ, ఆ పార్టీకున్న ఓటమి భయానికి ఇది నిదర్శన మని కాంగ్రెస్‌ విమర్శించింది. అయితే తాము ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వీ మాట్లాడుతూ ‘పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైనంత ఆధిక్యం బీజేపీకి లేదన్న విషయం ఆ పార్టీకి బాగా తెలుసు. అయినా దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకే, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు ఈ బిల్లు తీసుకొస్తున్నారు. మరి గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఏం చేశారు?’అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు తెలపడం తప్పనిసరి. విపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటం అసాధ్యం. అయితే అగ్ర కులాల ఓట్ల కోసం ఈ బిల్లుకు అడ్డుచెప్పే ప్రయత్నాన్ని ఏ పార్టీ చేయబోదని బీజేపీ విశ్వసిస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల బిల్లుతో సాధారణ ఎన్నికల్లో అగ్రకులాల ఓట్లు తమకు గణనీయంగా పడతాయని బీజేపీ భావిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: