ఏబీ వాజపేయీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కుప్పకూలి పోవటానికి కారణం జయలలిత, మాయావతి, మమత బెనర్జీ అనే ముగ్గురు రాటుతేలిన మహిళా ముఖ్యమంత్రులను ఎలా హాండిల్ చేయాలో బ్రహ్మచారి అయిన ఆయనకు తెలియక పోవటమే అంటారు సరదాగా! 


అలాగే ఇల్లూ పిల్లలు సంసారమూ ఏమీ లేని ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ఇంటిపోరును నివారించటంలో అనుభవం లేదు  ఆయన కార్యసాధకుడు కావచ్చు ఇల్లాల్ని హాండిల్ చేయటం మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఆ విషయం ఎంతకష్టమో వేమన అద్భుతంగా చెప్పాడు! రాజకీయ లేదుభరించలేక పోతున్నారట
సంబంధిత చిత్రం 

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ - కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా - విశ్వధాభిరామ వినురవేమ

narendra modi Satrughn sinha కోసం చిత్ర ఫలితం

పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసిన ఈ పద్యము, వేమన శతకానికే మకుటాయమానము.సామాన్యుల నుండి  మాన్యుల వరకు అందరికీ ఇబ్బందులు సమానము.


చెప్పులోరాయిదూరినా, చెవిలో జోరీగ రొద పెట్టినా, కంటిలో నలుసు పడినా ,కాలిలో ముల్లు గుచ్చుకున్నాకలిగే బాధ అనుభవైహికవేద్యమే తప్ప అనిర్వచనీయము. వీటన్నిటికీ మించి ఇంటిలోని ఇల్లాలు సాధింపు,సతాయింపు ఇంకా ధుర్భరము.వక్రీకరణము లేని ఇన్ని వాస్తవాలు చెప్పాడు కాబట్టే ఇప్పటికీ వేమన ప్రజాకవిగా జనాల హృదయాల్లో నిలిచిపోయాడు.


కాకపోతే ఇది నివాసముండే ఇంటిపోరు కాదు. తన స్వంత పార్టీ బిజేపి ఇంటి పోరు. పార్టీలో సర్వం తానే అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇంటి పోరు అంటే ఎలా? ఉంటుందో ? ఒక స్థాయిలో తెలిసివస్తున్నట్లుంది. బీజేపీ లో ఎదురులేని నేతగా ఎదిగి, పార్టీ సీనియర్లను సైతం విజయవంతంగా పక్క కు పెట్టిన్పటికీ ఆయనకు అసంతృప్త నేతలతో చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. 


పక్కలో బల్లెం లాగా మారిన  బీజేపీ పార్టీ నాయకుడు శత్రుఘ్న సిన్హా మరోమారు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ తన భావాలు పంచుకుంటే దానిపై సిన్హా సెటైర్లు వేశారు
narendra modi Satrughn sinha కోసం చిత్ర ఫలితం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పత్రికా సమావేశాలంటే నచ్చదని జాతీయ స్థాయి జర్నలిస్టుల్లో ఒక భావన నేలకొని ఉంది. గత నాలుగున్నరేళ్లలో ప్రధానిగా ఆయన ఒక్కటంటే ఒక్కటి పత్రికా సమావేశం నిర్వహించకపోవడం దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏఎన్ ఐ విలేకరి స్మితా ప్రకాశ్ కు మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడంపై పేరుకే బీజేపీ ఎంపీ అయినప్పటికీ నరేంద్ర మోడీ చర్యలన్నింటిని లక్ష్యంగా చేసుకోని మాట్లాడే శతృఘన్ సిన్హా ఘాటు కామెంట్లు చేశారు. 


“బోలెడు పరిశోధనతో - ఏర్పాట్లతో – పూర్వ రంగం సిద్ధం చేసుకుని మరీ ఏదో ఓ విలేకరికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు సరే హేమాహేమీల వంటి జర్నలిస్టులు పాల్గొనే బహిరంగ ఇంటర్వ్యూ ఎప్పుడు?” అంటూ సిన్హా ప్రశ్నించారు. 


“దేశ ప్రధానులు తరచుగా పత్రికా సమావేశాలు నిర్వహించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలో మీరెందుకు మీడియా ముందుకు రారు? సర్కారీ జర్నలిస్టులు పాడే రాగ్ దర్బారీలు ఎందుకు?” అంటూ తనదైన శైలిలో  ప్రశ్నల వర్షం గుప్పించారు.
modi interview with smita prakash కోసం చిత్ర ఫలితం

ఎన్డీఏకు పలు పార్టీలు గుడ్-బై చెప్పడాన్ని ప్రస్తావిస్తూ “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ (అందరి ప్రగతి) అనేది మీ నినాదం కదా? మరి అందరూ ఎందుకు వెళ్లిపోతున్నారు? మిత్రుడు - సహచరుడు - సోదరుడుగా నేనిచ్చే సలహా గురించి ఆలోచించండి.. కాదంటే ఎన్నికలు ఎటూ దగ్గర పడుతున్నాయి.. మనకికి దేవుడే దిక్కు సారూ! ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి! నూతన సంవత్సరం సందర్భం గా అంతా ధైర్యంగా - నిజాయితీగా - ఖుల్లంఖుల్లంగా మాట్లాడుకుందాం.. నాటకీయతలు లేకుండా.” అంటూ హితబోధ కూడా చేసేశారు. 
modi interview with smita prakash కోసం చిత్ర ఫలితం

కాగా  శతృఘన్ సిన్హా తన సెటైర్ల  ట్వీట్ లకు ప్రధాని విలేకరి స్మితా ప్రకాశ్ ను ట్యాగ్ చేయగా, ఆమె ఘాటుగా బదులిచ్చారు. సందేశం మోడీకే అయితే ఆయననే ట్యాగ్ చేయండి. నాలాంటి చిన్న జర్నలిస్టులను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? మీరు షాట్ గన్ సిన్హా కదా!  సాంబా కాదు కదా!  అని సిన్హాపై చురకలు వేశారు.
Replying to @ShatruganSinha

Sir if the tweet is for Mr Modi be the hero that you used to be and tag him no? Buzdilon ki tarah ek tuch patrakaar ko kyon tag kar rahein hain? Aap Shotgun hain, Saamba nahiin 🙏

9:22 PM - 2 Jan 2019


మరింత సమాచారం తెలుసుకోండి: