సామాజికంగా వెనకబాటు తనం అనుభవిస్తూవస్తున్న అణగారిన వర్గాలకు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలో విరచిత రాజ్యాంగంలో ఒక పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు కలిపించాలని రాసారు. ఆతరవాత దానిని ఎన్నికల రాజకీయాల కోసం ఎడా పెడా వాడేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. 


అగ్రకులాల్లోని ఆర్థిక బలహీనవర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని ఆయన మనవడు, సామాజికవేత్త ప్రకాశ్‌ యశ్వంత్ అంబేడ్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
prakash ambedkar photo కోసం చిత్ర ఫలితం
నిన్న మంగళవారం అనంతపురంలో జరిగిన బహుజన బలిజ ఫ్రంట్‌ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కానీ నాలుగున్నరేళ్ల  పాలనలో రిజర్వేషన్‌ లకు సంబంధించి ఒక కమిటీ గానీ, మంత్రి మండలి నిర్ణయంగానీ లేకపోవడాన్ని తప్పుబడుతున్నారు. 


రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆర్థిక బలహీన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని దేశవ్యాప్తంగా ఉన్న కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

prakash ambedkar photo కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: