ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.  విద్యా, వైద్య, ఉద్యోగుల విషయాల్లో ఎన్నో సంస్కరణలు చేపట్టారు.  ఇక ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు.  విదేశాల్లో ఉన్న వారు సైతం తమ గ్రామాలకు చేరుకొని ఇంటిల్లిపాది సంక్రాంతి పండుగను ఎంతో ఆనందోత్సాహల మద్య జరుపుకుంటారు. 
Related image
సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే సందడి నెలకొంటుంది. తాజాగా  రేషన్ డీలర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. గతంలో సరుకుల పంపిణీ కమిషన్ 75 పైసల నుంచి రూపాయికి పెంచుతున్నట్టు తెలిపింది.  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా షన్ డీలర్లకు కమిషన్ పెంచాలని ఆదేశించామని తెలిపారు.
Image result for pattipati pullarao
పంచదార, బియ్యం, రాగులు, జొన్నలు, కందిపప్పు కమిషన్ ను ఒక రూపాయి చేశామని అన్నారు ఇక ప్రభుత్వం నిర్ణయంతో 29 వేల రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గత ఏడాది చంద్రన్న కానుకల కమిషన్ ను రూ. 5 నుంచి రూ. 10కి పెంచామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 25 పైసలు ఉన్న కమిషన్ ను రూపాయి చేశామని చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: