తమ తమ రాష్ట్రాల్లో దేశ నిఘా సంస్థల ప్రవేశ నిషేధం అమలు పరచే వాళ్లు ఈ దేశాన్ని ప్రజలను ఎలా సమ్రక్షించ గలరు? అసలు తాము నిప్పు అగ్నిపునీతలం అని నిరూపించుకునే అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారంటేనే తాము నేరగాళ్ళం అని ఒప్పుకున్నట్లే! వాళ్ళకి ఉండాల్సింది అసమర్ధ కేంద్రం. అప్పుడే రాష్ట్రాలను వీలున్నంత దోపిడీ చెయ్యొచ్చు. ప్రశ్నించే వారుగాని శిక్షించేవారుగాని ఉండరు.

mahagaThbandhan కోసం చిత్ర ఫలితం

అదే విషయాన్ని బలంగా చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ - బలహీన ప్రభుత్వం వస్తే దేశాన్ని దోచుకోవచ్చని ప్రతిపక్షం భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. ఢిల్లీ లోని రాంలీలా మైదాన్‌ లో జరుగుతున్న బీజేపీ జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన శనివారం మాట్లాడారు.

narendra modi speech at ramleela maidan in telugu కోసం చిత్ర ఫలితం

భారత రాజకీయాల్లో మహాకూటమి - మహాఘట్భంధన్ పేరిట ఒక రాజకీయ ప్రయోగం జరుగుతుంది. ఒకనాటి కాంగ్రెస్ విద్వెషులు ఇప్పుడు దాని మిత్రులుగా మారారంటే అర్ధం అవకాశ వాదం.  ఈ గాయపడ్డ రాజకీయ బాధితులు అంతా కలిసి ఈ సారైనా ఒక నిస్సహాయ ప్రభుత్వం (మజ్‌బూర్ సర్కార్) కేంద్రంలో ఏర్పడాలని కోరుకుంటున్నారని అన్నారు.


ఈ అవకాశవాద స్వార్ధ పరులకు బలమైన ప్రభుత్వం (మజ్‌-బూత్ సర్కార్) అవసరం లేదని, అది వస్తే వాళ్ల అవినీతి, బందుప్రీతి, స్వార్ధం, కుల మత కుటుంబ అభివృద్ధే ధ్యేయంగా స్కాం కబ్జా, ప్రకృతివనరుల దోపిడీలకు గత ఐదు సంవత్సరాలుగా అడ్డుకట్ట పడటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 2019 ఎన్నికల్లో కలసి తమ కలగూరగంప ప్రభుత్వ నిర్మాణం చేయాల ను కుంటున్నారు. లేకుంటే వారి విచ్చలవిడి దోపిడీలు మరోసారి ఆగిపోతాయన్నదే వారి భయమని మోదీ చెప్పారు.

narendra modi speech at ramleela maidan in telugu కోసం చిత్ర ఫలితం

రైతులకు వారి పంటలకు సరైన ధర లభించడానికి తాము బలమైన ప్రభుత్వం రావాలనుకుంటున్నామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం మళ్లీ యూరియా స్కాం చేయడానికి వీలుగా, బలహీన ప్రభుత్వాన్నే (మజ్- బూర్ ) కోరుకుంటున్నాయని విమర్శించారు. సాధారణంగా రాజకీయాలంటే సిద్ధాంతాల ప్రాతిపదికగా ఉంటాయని, ఈ రాజకీయ కూటములు కూడా దూరదృష్టితో ఉంటాయని, కానీ తొలిసారి దేశంలోని అన్ని పార్టీలు కలిసి కేవలం ఒకే ఒక్క వ్యక్తిని ఓడించడానికి మాత్రమే అకర్మ సంఘమం అవుతున్నాయని నరేంద్ర మోదీ అన్నారు.


అయోధ్య భూవివాదం పరిష్కారం కాకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ పార్టీ తన న్యాయవాదుల ద్వారా అయోధ్య కేసుకు అడ్డంకులు కలిగిస్తోందని, ఆరోపణలు చేయడం ద్వారా ప్రధాన న్యాయమూర్తిని సైతం అభిశంసించేందుకు వారు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆలోచించేది కాంగ్రెస్‌ మనస్తత్వమే నన్నది పలుమార్లు ఇప్పటికే చరిత్ర చూస్తే ఋజువైందని అన్నారు.

mahaghaTbhandan కోసం చిత్ర ఫలితం

అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ - ఇది అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు గానీ, దేశాన్ని కొత్తదిశలో ముందుకు తీసుకెళ్ల గల సామర్ధ్యం మాత్రం దానికి ఉంటుందన్నారు. దీనివల్ల నవభారతానికి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు.  పైగా ఈ కొత్త అవకాశం వల్ల ఏ ఒక్కరి హక్కులూ పోవని అన్నారు. రైతుల సమస్య గురించి మాట్లాడుతూ,  ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ రైతులను కేవలం ఓటర్లుగానే చూశాయని, కానీ తమ ప్రభుత్వం మాత్రం వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడానికి తాము పగలు, రాత్రి కష్టపడుతున్నామని అన్నారు.


ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో సీబీఐని నిషేధించటం చాలా చిత్రమైన విషయమని తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలు ఏ అక్రమాలకు పాల్పడక పోతే సీబీఐ గురించి గాబరా పడవని భయ పడుతున్నారు అంటేనే ప్రశ్నించాల్సిన సందర్భమని అన్నారు. ఇప్పుడు వాళ్ళు సీబీఐ ని వ్యతిరేకిస్తున్నారు, రేపు మరో సంస్థను వ్యతిరేకిస్తారని, ఆర్మీ, పోలీసులు, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, కాగ్-- అన్నీ తప్పేనని, కేవలం వాళ్లు మాత్రమే ఒప్పని అంటున్నట్లే కదా! అంటూ ఎద్దేవా చేశారు.


తాను మరికొన్ని నెలల్లో జైలుకు వెళ్తానని 2007లో ఒక కాంగ్రెస్ మంత్రి అన్నారని, వాళ్లు చివరకు అమిత్‌షా ను జైల్లో కూడా పెట్టారని, కానీ తాము మాత్రం సీబీఐ ని గుజరాత్‌ లోకి రానివ్వ కుండా ఎలాంటి చట్టం చేయలేదని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తనను 12 ఏళ్ల పాటు వేధించినా ఒక్క రోజు కూడా తాను తమ రాష్ట్రంలోకి సీబీఐ రాకను నిషేధించలేదని గుర్తుచేశారు.

mahaghaTbhandan కోసం చిత్ర ఫలితం

సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం దేశం మారగలదని బీజేపీ ప్రభుత్వం ఋజువు చేసిందని, ప్రభుత్వం అవినీతి లేకుండా,  అధికార కేంద్రాల్లో మధ్యవర్తులు లేకుండా, నడవగలదని కూడా నిరూపించిందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధానమంత్రి అయి ఉంటే, దేశం ఇప్పుడు మరింత విభిన్నంగా ఉండేదని తెలిపారు.

అలాగే, అటల్ బిహారీ వాజ్‌పేయి 2000 సంవత్సరం ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా ఉండి ఉంటే దేశం సరికొత్త శిఖరాలకు అధిరోహించి ఉండేదని ప్రధాని తెలిపారు. తమకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని అంధకారం లోకి నెట్టేసిందని, యూపీఏ హయాంలో జరిగిన స్కాం లు, అవినీతి వల్ల భారతదేశం పదేళ్ల అభివృద్దిని కోల్పోయిందని అన్నారు.


21వ శతాబ్దంలోని తొలి పదేళ్లు దేశానికి చాలా ముఖ్యమని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. ఇందుకు తాము గర్వపడు తున్నామని చెప్పారు. కేంద్రంలోను, 16 రాష్ట్రాలలోను బీజేపీ, మిత్రపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు కేవలం రెండు గదుల్లో, ఇద్దరే ఇద్దరు ఎంపీలతో నడి చిన పార్టీ, ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో జాతీయ సదస్సు నిర్వహిస్తుందని ఇది చాలా అద్భుతం, మరువలేనిదని చెప్పారు.

సంబంధిత చిత్రం

కాపలాదారును ఎవరూ ఆపలేరని, అతడు ఏ ఒక్కరినీ వదలిపెట్టడని, కాస్త వెనకా ముందు మాత్రమేననిఅన్నారు.  ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఇంతకు ముందు ఋణాలు రెండు రకాలుగా తీసుకునేవారని, వాటిలో ఒకటి సాధారణ విధానం కాగా, మరొకటి కాంగ్రెస్ విధానమని చెప్పారు.


కాంగ్రెస్ విధానంలో బ్యాంకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ల మోసకారి స్నేహితులకు బలవంతంగా ఋణాలు ఇవ్వాల్సి వచ్చేదన్నారు.  ప్రజానుకూల విధానాలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, దేశా భివృద్ధికి అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన నాయకులు దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించ లేరంటూ సోనియా, రాహుల్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: