ఏపీ ప్రతిపక్షనేత జగన్ రాజకీయంగా బాగా బలహీనపడ్డాడా.. అవునంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఆయన ఇటీవల తరచూ పార్టీ నేతలతో ఈ కామెంట్ చేస్తున్నారట. చంద్రబాబు ఎక్కడ ఉన్నా.. రోజూ టెలీకాన్ఫరెన్సులో పార్టీ నేతలతో మాట్లాడుతూనే ఉంటారు. ఆ సమయంలో బాబు ఈ కామెంట్స్ చేస్తున్నారట.


టీఆర్‌ఎస్‌తో కలవడం ద్వారా జగన్ పూర్తిగా బలహీనపడ్డారని చంద్రబాబు అభిప్రాయపడుతుతన్నారు. అంతే కాదు.. ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదని పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. ప్రతిపక్షం బలహీనతలపై ఆధారపడి మనం ఉండకూడదని క్యాడర్‌కు సలహాలిస్తున్నారు.


కోల్ కత్తా సభకు 10 లక్షల మందిపైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి ధీటుగా నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రానికి ఏం మేళ్లు చేశారని కేంద్రమంత్రులు వారానికి ఒకరు వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులు చేస్తున్నారని, వీళ్ల బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని తెలిపారు.


మరి నిజంగానే చంద్రబాబు చెబుతున్నట్టు వైసీపీ బలహీనపడిందా.. టీఆర్ఎస్‌తో కలవడంతో తన సత్తా కోల్పోయిందా.. అదే నిజమైతే చంద్రబాబు మరీ ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నట్టు.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని మరీ రాజకీయాలను వేడెక్కిస్తున్నట్టు.. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: