రాజకీయాధికారం కోసం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పెనుగులాటలో కుటుంబ సభ్యులే వెన్నుపోటుదారులుగా ఈ వైస్రాయ్ ఎపిసోడ్ కు నాయకత్వం వహించిన చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు ఎరిగిన సత్యం. అప్పటి నుండే జామాత దశమ గ్రహః అనే నానుడి సామాన్యుడి వరకు తెలిసొచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. అసలు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుంది? తమ నాయకుడికి కళంకం అంట కుండా ఆ శాసన సభ్యుడు ఆ నాయకుడి మెప్పుకోసం వేసే స్వప్రయోజన వ్యాజ్యం అవుతుందని అంటున్నారు జనం. 
Related image
ఆనాడు సకలాంద్రులు వీక్షించిన వెన్నుపోటు కథా కమామిషు తెలిసినవారు ఈ పాట లో ప్రతిద్వనించిన ప్రతి అక్షరం సత్యమే,  చెరిగిపోని శిలాక్షరమేనని ఆ ఎమెల్యే సహచరులే అంటు న్నారు. అందులో ఇసుమంత అసత్యం లేదు. చంద్ర బాబును కించపరిచేలా చూపుతున్నా రని అని వేసిన పిటీషన్ పై సరైన తీర్పు వస్తుందని ముఖ్యమంత్రి అయినంత మాత్రనా చేసిన కుట్రకు కించపడవలసిందే అంటున్నారు ఆ తరం జనం. ఏదేమైనా న్యాయస్థానం తన తీర్పు వెలువరిస్తుంది కదా! 
Image result for Pil on Lakshimi's NTR 
ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో దగా.. దగా.. కుట్ర.. పాట విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళ వారం కేంద్ర, రాష్ట్ర సెన్సార్‌ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ పాటను సినిమాతో పాటు సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ నుంచి తొలగించాలని పిటిషనర్‌ కోరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Court issued notices to central and state sensor boards on Lakshmis NTR Song - Sakshi
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దగా.. దగా.. కుట్ర పాటలో ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా చూపుతున్నారని, ఈ పాటను సినిమా నుంచి, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా సెన్సార్‌ బోర్డును ఆదేశించాలని కోరుతూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.
Related image
దీనిపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ ఏపీకి చెందిన వ్యక్తి అయినప్పుడు, ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టులో ఎలా దాఖలు చేస్తా రని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసే నాటికి హైకోర్టు ఉమ్మడిగానే ఉందని, ఈ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారని ఎమ్మెల్యే తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకట రమణ చెప్పారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడు చేయడానికి సంబంధించిన పాట అని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా ఉందని అన్నారు. చంద్రబాబును మోసకారిగా చూపుతున్నారని, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి చంద్రబాబే కారణమన్నట్లు ఈ పాటలో చూపుతున్నారని తెలిపారు. 
Image result for Pil on Lakshimi's NTR

మరింత సమాచారం తెలుసుకోండి: