వైఎస్‌ జగన్‌ గురించి రాజకీయ వర్గాల్లో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన చాలా గర్విష్టి అని.. కోపిష్టి అని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినవారు చెబుతుంటారు. ఆయన ఎవరి మాటా వినరని.. ఎవరి సలహాలు తీసుకోరని కూడా విమర్శలు ఉన్నాయి.

jagan angry కోసం చిత్ర ఫలితం

తాజాగా వంగవీటి రాధాకృష్ణ చేసిన కామెంట్లతో మరోసారి జగన్ వ్యవహారశైలిపై చర్చ మొదలైంది. వంగవీటి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు జగన్ పైన. జగన్ తమను బానిసల్లా చూసాడన్నది వంగవీటి ఆరోపణ. విగ్రహావిష్కరణకు కూడా చెప్పి వెళ్లాలా అని ప్రశ్నించారు.

jagan vangaveeti కోసం చిత్ర ఫలితం

నిన్ను గుప్పిట్లో పెట్టుకుని కాపాడుకున్నా.. కేవలం తండ్రి లేని వాడివనే జాలితోనే పార్టీలో ఉండనిస్తున్నా.. అని జగన్ తనతో పదే పదే అనే వారని వంగవీటి చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లే వారు అధినేతపై విమర్శలు చేయడం సహజమే. వైసీపీ నుంచి గతంలో వెళ్లిన వారు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు.

jagan angry కోసం చిత్ర ఫలితం


తన వ్యవహార శైలిపై జగన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా వివరణ ఇచ్చారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. కానీ వంగవీటి ఆరోపణలు చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్‌ కూడా తన వ్యవహారశైలిని ఒకసారి పునస్సమీక్ష చేసుకుంటే రాజకీయంగా లాభపడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: