గత కొంత కాలంగా ఉత్తర్ ప్రదేశ్ లో నేరాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరస్తుల మీద ఏ రేంజ్‌లో ఉక్కుపాదం మోపుతోందో తెలియజేసే ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. యోగి అధికార పీఠాన్ని అధిరోహించిన 2017 మార్చి నుండి 2018 జులై వరకు అనగా 16 నెలల కాలంలో మూడు వేల ఎన్‌కౌంటర్లు జరగ్గా..78 మంది క్రిమినల్స్‌ మృతి చెందినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 838 మంది గాయపడ్డారు. 7043 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరచరిత్ర ఉన్న 11,981 మంది బెయిల్ రద్దు చేసి వారిని కోర్టుల్లో హాజరుపరిచారు.
Image result for yogi adityanath gun photos viral
అయితే ఈ ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన సామాన్య ప్రజలకు సంబంధించిన లెక్కలను డిజిపి కార్యాలయ అధికారులు వెల్లడించలేదు.  స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టిఎఫ్‌) తొమ్మిది మంది క్రిమినల్‌ను హతమార్చగా, 139 మంది అరెస్టైనట్లు లేఖలో తెలిపింది. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే ప్రతిరోజు సగటును 6 ఎన్‌కౌంటర్లు జరుగుతుండగా, 14 మంది క్రిమినల్స్‌ అరెస్టు అయ్యారు.కాగా, రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో   ప్రభుత్వ విజయాల లిస్ట్ కింద ఎన్ కౌంటర్ల సంఖ్య, చనిపోయిన నేరస్థుల సంఖ్య, అరెస్టుల లిస్ట్ ను ప్రచారం చేయనున్నారు. 
Image result for yogi adityanath gun photos viral
ప్రభుత్వ విజయాల లిస్ట్ గా తెలుపుతూ..ఇప్పటికే ఈ జాబితా సమాచారాన్నియూపీ చీఫ్ సెక్రటరీ అనుప్ చంద్ర పాండే   అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత నేరాలు తగ్గుముఖం పట్టాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. యోగి కాషాయ వస్త్ర ధారణలో గన్ చేతపట్టుకొని పక్కన ఆవుతో నిలబడి ఉన్న జిలా గోరఖ్ పూర్  మూవీ పోస్టర్ గతేడాది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: