రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఇది చాలా పాత రొటీన్ సామెత. ఇప్పడు చంద్రబాబు సరికొత్త సామెత సృష్టించారు. ఒకే సమయంలో మిత్రత్వం, శత్రుత్వం పాటించే అరుదైన రాజకీయం నడిపిస్తున్నారు.



అదెలాగంటారా.. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేస్తున్న కాపురం చూస్తే ఎలాంటి వారైనా అవాక్కవ్వాల్సిందే.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందట. కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతాట. కానీ రాష్ట్రంలో మాత్రం ఇద్దరూ కత్తులు దూస్తారట.

chandrababu vs raghuveera కోసం చిత్ర ఫలితం


అదేం గురువు గారూ.. అలాగా.. అంటే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పే సమాధానం భలే వింతగా ఉంటుంది. దేశ ప్రయోజనాలకోసం కేంద్రంతో ఎన్డీయేయేతర పక్షాలకు మద్దతు పలుకాలన్నది తమ పాలసీ అట. అందుకే కేంద్రంలో కాంగ్రెస్ తో జట్టు కడతారట.

chandrababu vs raghuveera కోసం చిత్ర ఫలితం


అంతే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండదనే పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రాలలో స్థానిక పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ ఉంటుందని.. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: