ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు చేస్తున్న వ్యాఖ్యలకు నవ్వాలో..ఏడ్వాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.  అయితే సెలబ్రెటీలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  అప్పట్లో  ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవరో తనకు తెలియదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అప్పట్లో హాట్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బీజేపి, టీడీపికి సపోర్ట్ చేసి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపి గెలవడానికి పరోక్షంగా సహాయం చేసిన పవన్ కళ్యాన్ తెలియదని ఓ టీడీపికి చెందిన మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు వచ్చాయి.  ఈ విషయంపై జనసైనికులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సరే ఇది ఒకప్పటి మాట..ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో పదే పదే పవన్ కళ్యాన్ మాట వినిపిస్తుంది.  వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి ఆయన ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు మళ్లీ పాత పాటే పాడారు. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని మరోమారు వ్యాఖ్యానించారు. 

‘ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అశోక్ గజపతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను మూవీస్ చూడనని, కాబట్టి పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నారు. ఆయన అన్న చిరంజీవి మాత్రం తనకు తెలుసన్నారు. వాళ్ల తండ్రి కూడా తనకు తెలుసని అశోక్ గజపతి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఓ సారి తనను కలిస్తే పనిచేసి పెట్టానని గుర్తు చేసుకున్నారు. దీంతో మరోసారి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: