ఎన్నిక‌ల వేళ‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మ‌ళ్లీ ఏపీలో అధికారంలోకి రావాలి. ఇదీ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముందున్న ప్ర‌దాన, ఏకైక లక్ష్యం. అయితే, ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌డిచిన వారం ప‌ది రోజులుగా భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌పై వ‌రాల వ‌ర్షాలు కురిపించేస్తున్నారు. ప్ర‌జ‌లు కోరుతున్న‌వీ, కోర‌నివీ కూడా ఇచ్చే స్తున్నారు. రాష్ట్రంలో ఏపేరుతో సామాజిక వ‌ర్గం ఉన్నా కూడా ఆ వ‌ర్గానికి కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. వంద‌ల కోట్ల‌ కొద్దీ రూపాయ‌ల‌ను ఆయ‌న ప్ర‌క‌టించేస్తున్నారు. ఇక, ఇప్ప‌టికేసంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు కూడా భారీ ఎత్తున నిధులు పెంచారు. సామాజిక పింఛ‌న్ల‌ను రెండింత‌లు చేశారు. ఇంతా బాగానే ఉంది. 


చంద్ర‌బాబు దృష్టిలో ఇక‌, రాష్ట్రంలో ఎవ‌రూ త‌న‌ను ఎదిరించ‌లేరు. ఇంత‌క‌న్నా మెరుగైన ప‌థ‌కాల‌ను కానీ, ఇంత క‌న్నా భారీ రేంజ్‌లో న‌గ‌దు ప‌థ‌కాల‌ను కానీ ప్ర‌క‌టించే సాహ‌సం కూడా ఎవ‌రూ చేయ‌రని ఆయ‌న ఆలోచిస్తున్నారు. గెలుపు,వార్ అన్నీ వ‌న్ సైడ్ అయిపోతాయ‌ని ఆయ‌న, ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ఓ వ‌ర్గం మీడియా కూడా పెద్ద ఎత్తున భారీగా ప్ర‌చారం చేస్తోంది. అయితే, ఎంత అవున‌న్నా.. కాద‌న్నా.. టీడీపీలోనూ చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌పై నిశితంగా ప‌రిశీలించి, కామెంట్లు చేసే(బ‌హిరంగంగా కాక‌పోయినా) ఓ వ‌ర్గం అంటూ ఎప్పుడూ ఒక‌టి ఉంటుంది. ఇప్పుడు ఈ వ‌ర్గ‌మే.. ఓ చిన్న కామెంట్‌ను సోష‌ల్ మీడియాకు వ‌దిలింది. మానాయ‌కుడు అతి చేస్తున్నాడు!- అనేది వీరి కామెంట్‌. 


వీరి కామెంట్ అత్యంత వేగంగా వైర‌ల్ అయింది. దీంతో ఇప్పుడు దీనిపై చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం త‌ప్పుకాదు. దీనికి సంబంధించి ప్ర‌తి పార్టీ కూడా అతీత‌మూకాదు. కానీ, ఒక్క‌సారిగా ఇన్ని ప‌థ‌కాలు, ఇన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ఇంత భారీ ఎత్తున న‌గ‌దు ప్ర‌క‌టించ‌డంపై మాత్రం అతి అనేది నిజ‌మేనేమో అని చ‌ర్చించుకుం టున్నారు. చంద్ర‌బాబు అనుకున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌తో అటు వైసీపీ అధినేత జ‌గ‌న్ కానీ, ఇటు జ‌న‌సేన‌నాని ప‌వ‌న్ కానీ ఉలిక్కిప‌డింది లేదు. పైగా ఎన్నిక‌ల వేళ ఈ ప‌థ‌కాలు ఏంటి? ఈ పందేరాలేంటి? అని అనుకున్న‌ది కూడా లేదు. 


ఈ మొత్తంపై విశ్లేష‌కుల అభిప్రాయం చూస్తే.. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు ఆయ‌న‌కు మేలు చేస్తాయో లేదో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, అయితే, ఎన్నిక‌ల పుణ్య‌మా అని కొన్ని ద‌శాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు మాత్రం తీరుతున్నాయ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రు ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టించినా.. ప్ర‌జ‌లు చివ‌ర‌కు వారు ఎవ‌రిని కోరుకుంటున్నారో వారికే ఓట్లు వేస్తార‌ని ముక్తాయిస్తున్నారు. మ‌రి దీనిని బ‌ట్టి బాబు క‌ల నెర‌వేరుతుందా?   జ‌గ‌న్ ప‌రిశ్ర‌మ ఫ‌లిస్తుందా?  ప‌వ‌న్ సెంటిమెంట్ స‌క్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే.. ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: