నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. మరి ఈ బడ్జెట్‌లో మోడీ వరాల వర్షం కురిపించనున్నాడా.. ఏ ఏ వర్గాలను సంతోషరుస్తాడు.. ఓసారి చూద్దాం.

Related image


ఇటీవల దేశవ్యాప్తంగా అన్నదాతలు నిరసన ప్రదర్శనలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. అందుకే సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు అన్నదాతల్లో ఉన్న అసంతృప్తి తొలగించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని మోడీ సర్కారు భావిస్తోంది. కానీ కాంగ్రెస్ సర్కారులు ప్రవేశపెట్టిన రుణమాఫీ పట్ల మోడీ అంత సుముఖంగా లేరు.

Image result for budget 2019 modi


అందుకే తెలంగాణ రైతుబంధు తరహా పథకాన్ని జాతీయస్థాయిలో అమలు చేయాలని మోడీ ప్లాన్ చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకున్న ఆదాయ లోటు సమస్యను పరిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సకాలంలో పంట రుణాలను చెల్లించిన రైతులకు వడ్డీని మాఫీ చేసే ప్రతిపాదన ఇందులో ఒకటి.

Related image


ఆహార పంటలకు తీసుకున్న బీమాపై ప్రీమియాన్ని పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచన కూడా ఉంది. రుణమాఫీ కన్నా నగదు బదిలీ అమలు చేయడం శ్రేయస్కరమన్న వాదన కూడా ఉంది. రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మోడీ ఎలాంటి వరాలు కురిపిస్తాడో..


మరింత సమాచారం తెలుసుకోండి: