2019 ఏపీ ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దమవుతున్నాయి. తమ బలం పెంచుకునేందుకు.. ఎదుటి వారి బలం తగ్గించుకునేందుకు అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు రాయలసీమ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

Related image


ప్రత్యేకించి జగన్ కోటలుగా పిలుచుకుంటున్న జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాలను టీడీపీ వైపుకు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో బలమైన కోట్ల కుటుంబాన్ని టీడీపీ వైపు లాగేశారు.

Image result for kotla surya prakash reddy family


మరోవైపు కడప జిల్లాలోనూ సొంత పార్టీలోని గ్రూపులకు సయోధ్య కుదురుస్తున్నారు. జగన్ ప్రత్యేకమైన బలంగా చెప్పుకునే ఈ ప్రాంతాల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ ఇప్పటికే కాస్త బలంగానే ఉంది.

Image result for chandrababu vs ys jagan


ఇక కడప, కర్నూలు జల్లాల్లో జగన్ స్వీప్ లేకుండా చూసుకుంటే... ఆ నష్టాన్ని మిగిలిన జిల్లాల్లో భర్తీ చేసుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే శత్రువర్గాల్లోని ముఖ్యులపై కూడా గాలం వేస్తున్నారు. మరి చంద్రబాబు వ్యూహాలకు జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి. కడప జిల్లాలో మేడా వైసీపీ వైపు రావడం జగన్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. చంద్రబాబును ఎదుర్కోవాలంటే ఇలాంటి ఎత్తుగడలు ఇంకా అవసరమే.


మరింత సమాచారం తెలుసుకోండి: