ఔను హంగ్ సర్కారు రావాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారు.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకూడదని ఆయన ఆశపడుతున్నారు. అదేంటి.. ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటారు కానీ హంగ్ ఎందుకు కోరుకుంటారు అనుకుంటున్నారా..

Image result for modi vs rahul


జగన్ కోరుకునే హంగ్ రాష్ట్రంలో కాదు.. కేంద్రంలో.. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో హంగ్ ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు మంచిదని జగన్ అంటున్నారు. హంగ్ వస్తే.. ఏపీలో వైసీపీకి 25కు 25 ఎంపీ సీట్లు వస్తే.. అప్పుడు రాష్ట్రానికి ఏంకావాలన్నా సాధించుకోవచ్చని జగన్ అంటున్నారు.

Related image


వైసీపీ ఎన్నికలకు ముందుగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందోచూసి వారికి షరతులతో కూడిన మద్దతు ఇస్తారట జగన్. ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం పెట్టిన వారికే ఎన్నికల తర్వాత తమ మద్దతు ఉంటుందని జగన్ క్లారిటీ ఇచ్చారు.

Related image


కేంద్రంలో హంగ్ వస్తే రాష్ట్రానికి ఏం కావాలన్నా సాధించుకోవచ్చు.. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ లతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా జరిగేలా డిమాండ్ చేసే అవకాశం వస్తుందని జగన్ ఫీలవుతున్నారు. జగన్ ఆశలకు తగ్గట్టుగానే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని తాజాగా చాలా సర్వేలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: