బీజేపి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు  నిన్న గురువారం నాడు తన స్వంత పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశం కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు.

Image result for vishnu kumar raju about TDP alliance

గురువారం నాడు  ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయడం, కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవటం గురించి ఆయన ప్రస్తావించారు. వన్‌-షాట్ టూ బర్డ్స్‌ అనేది ఒక సామెత అని, కాని తెలంగాణ ఎన్నికల్లో అది వన్-షాట్ త్రీ బర్డ్స్ గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.  ఏపీ సీఎం దెబ్బకు  తెలంగాణలో టీడీపీ శాశ్వితంగా కోలుకోలేని దెబ్బతిన్నదని అన్నారు. ఒంటరిగా టీడీపీ పోటీ చేసి ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు ఎక్కువగా గెలిచి ఉండేవారన్నారు.

Image result for vishnu kumar raju about TDP alliance

మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడ  ధారుణమైన తిరిగి కోలుకోలేనంత నాశనమైందని అభిప్రాయపడ్డారు. మరోవైపు  బీజేపీ కూడ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు చంద్రబాబు తెలంగాణా ఎన్నికల ప్రవేశంతో వార్-వన్సైడ్ గా మారి బీజేపీ సంప్రదాయ ఓటర్లు సైతం కూడ బలుక్కొని బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చు అన్న రీతిలో టీఆర్ఎస్‌ కు మూకుమ్మడిగా ఓటేశారని ఆయన చెప్పారు. ఏపీలో టీడీపీతో పొత్తులు పెట్టుకొంటే ఆ పార్టీ ఏ పార్టీ అయినా తిరిగి కోలుకోలేనంత దెబ్బతినే అవకాశం పుష్కలంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది ఇప్పుడే చెప్పలేనని చెప్పారు.

 Image result for no one can survive if they have alliance with tdp

మరింత సమాచారం తెలుసుకోండి: