ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం.. ఈ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. చివరకు తెలంగాణ సీఎం కూడా ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే.. కావాలంటే నేను ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా అంటున్నాడు. మరి ఏపీకి అంతగా అవసరమైన ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదు.

Image result for special status for ap


ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఏం చేయాలి.. ఈ ప్రశ్నలకు సమాధానం స్వయంగా చంద్రబాబే చెప్పారు. తాను కుర్చీనుంచి దిగితే కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పిందట. అఖిల పక్ష నేతలతో జరిగిన భేటీలో చంద్రబాబు స్వయంగా ఈ విషయం చెప్పారు.

Image result for special status for ap


మోడీకి చంద్రబాబు అంటే కోపం ఉంది కాబట్టే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదట. మరి ఇప్పుడు ఏం చేయాలి.. ఏం చేస్తే హోదా వస్తుంది. మోడీ పీఎంగా ఉన్నంత కాలం హోదా రాదు. మరి వచ్చే ఎన్నికల తర్వాత మోడీ దిగిపోతాడా.. దిగిపోకపోతే పరిస్థితి ఏంటి..

Image result for special status for ap


మోడీని ప్రధాని కుర్చీ నుంచి దించడం ఏపీ ప్రజల ఒక్కరి వల్ల అయ్యే పని కాదు.. అందుకే దేశమంతా ఒక్కటవ్వాలి.. మరి ఏపీ ప్రజల చేతుల్లో ఉన్న పని ఏంటి.. ఏముంది.. చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి దింపడమే.. మరి మోడీని దించుదామా.. చంద్రబాబును దించుతామా అన్నది ఏపీ ప్రజలే తేల్చుకోవాలేమో..


మరింత సమాచారం తెలుసుకోండి: