తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది.  ఆ సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బిజేపీ ఇందుకు సమ్మతం కూడా తెలిపింది.  ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం..పైగా అసలు ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం చెప్పడం పై ఏపి ప్రజలు, నాయకులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నేడు ఏపిలో బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. 


ఈ బంద్ కి అన్ని కార్మక, పారిశ్రామిక, విద్యా సంస్థలు బందుకు సంపూర్ణ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు జాతీయపార్టీలతో కలిసి దిల్లీలో ధర్మపోరాటం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. 


ఇక కేంద్రం తీరుకు నిరసనగా ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా ఏపీ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా నలుపు దుస్తులు ధరించి రావాలని ఎమ్మెల్యేలను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం స్వయంగా నలుపు రంగు దుస్తులు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: