చంద్రబాబు అబద్ధాలకు అంతూ పోంతూ లేకుండా పోతుంది. రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ తెచ్చింది ఎన్టీఆర్ అట. చరిత్రకు మసి బూసి మారేడుకాయ చేయటం బాగా వంటబట్టించుకొని గొంతుంది గదా! అని శాసనసభలో ధమ్మున్న ప్రతిపక్షం లేకపోవటంతో నోటిదూల పెరిగిపోతుందని అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూర్ జిల్లా తాడికొండలో 1972లో తొలి రెసిడెన్షియల్ పాఠశాలను ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏ పి ఆర్ ఈ ఐ ఎస్) క్రింద కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించింది. అయితే పేదలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పిందే ఎన్టీఆరే నని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యార్థులకు స్కాలర్‌-షిప్‌లు ఆన్‌-లైన్ ద్వారా అందిస్తున్నామన్నారు. "తను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను" అని చంద్రబాబు అంటూ ప్రస్తుతం పేద విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తు న్నామని అన్నారు.

Image result for NTR model school Bhuvaneswari

తెలుగుజాతి భవిష్యత్ కోసమే సైబరాబాద్‌ ను నిర్మించానని తెలిపారు. అలా ఆడిన అబద్ధాల ఫలితమే తెలంగాణాలో టిడిపిని దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, కమ్యూనిష్టు, మరియు తెలంగాణా జన సమితి పార్టీలకు దాదాపు కూకటివేళ్లతో పెరికేసి సమాధి కట్టేశారు. పదే పదే చెపితే ఆడిన అబద్ధాలు నిజం కాదు. ఒకవేళ ఏదైనా నిజమున్నా ప్రజలు అది బద్ధమని అనుకునే ప్రమాదముంది. పార్టీ కోసం పనిచేసే వారి పిల్లల కోసం ఎన్టీఆర్ స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే ప్రజలకు కాదని పార్టీ కోసం పనిచేసే వారి కోసమే ఎన్టీఆర్ పాఠశాలలు ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పినట్లే కదా!


ఇప్పటికే హెరిటేజ్ ను ఎంతో స్థాయికి తీసుకువెళ్లారని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను కూడా అదేస్థాయిలో తీసుకెళ్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. హెరిటేజ్ కు ప్రజలకు, అలాగే ఎన్ టీఆర్ మోడల్ స్కూల్ కు పేద ప్రజలకు ఏమైనా సంబందాలున్నాయా? చంద్రబాబు అంటున్నారు ప్రజలు. మీ ప్రైవేట్ వ్యాపార కార్య క్రమాల్లో కూడా ప్రజాసేవ ఉందనటం ఆశ్చర్యం కలిగిస్తుంద నేది జనాభిప్రాయం.

Image result for NTR model school Bhuvaneswari

"ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌" ను తన భార్య భువనేశ్వరి భవిష్యత్‌ లో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందని చంద్రబాబు చెప్పారు. అంతా కరక్టే అయినా భువనేశ్వరి పేదలకు ఉచిత విద్య అందిస్తారంటేనే ఆలోచించాల్సిన విషయం.

 

చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఐకాన్ అని ఆయన సతీ మణి నారా భువనేశ్వరి అభివర్ణించారు. గండిపేట లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న భువనేశ్వరి,  చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు అహర్నిశ లు రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తుంటే కొంతమంది పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా విపక్షాలు వాయిలెన్స్ చేస్తున్నాయని ఆరోపించారు. నిత్యం ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.

Image result for NTR model school Bhuvaneswari

మరింత సమాచారం తెలుసుకోండి: