వై కట్టప్ప కిల్డ్ బాహుబలి.. మూడేళ్ల క్రితం దేశమంతటినీ ఉత్కంఠ రేపిన ప్రశ్న ఇది. ఈ ఒక్క వాక్యం ద్వారానే రాజమౌళి కోట్ల ద్వారా కూడా దొరకని పబ్లిసిటీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నాడు.



Who baCk staBbed Ntr ?.. అంటూ వర్మ తాజాగా పెట్టిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ పైసా ఖర్చు చేయకుండా ట్విట్టర్ ద్వారానే తన కొత్త చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే.. ఎప్పుడూ ఆయన చంద్రబాబు పేరును నేరుగా వాడలేదు.



కానీ తన తాజా ట్వీట్‌ లో ఆయన నేరుగా చంద్రబాబు పేరు వాడేశాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది కల్పితం. కానీ CBN ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడన్నది మాత్రం నిజం. మరి ఆ నిజం ఏంటో తెలుసుకోవాలంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూడండి అంటున్నాడు వర్మ.



అసలే ఎన్నికల ముందు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చంద్రబాబుకు కంటగింపుగా మారుతోంది. ఓ వైపు చంద్రబాబు జై ఎన్టీఆర్ నినాదంతో జనంలోకి వెళ్తుంటే.. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఎన్నికలపై ఈ చిత్రం ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: