ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉంది?  మొన్నామ‌ధ్య ఢిల్లీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జరిగిన‌ప్పుడు టీడీపీ ఎంపీ ఒక‌రిని ఢిల్లీకి చెందిన మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. అయితే, ఆయ‌న చాలా బాగుంద‌ని, చంద్ర‌బాబు పాల‌న భేష్ అని అన‌ర్గ‌ళంలో ఓ ప‌దినిముషాలు దంచి కొట్టారు. ఆ వెంట‌నే అక్క‌డ గుమికూడిన మ‌రో జాతీయ మీడియా ప్ర‌తినిధి రాష్ట్రం లోటు బ‌డ్జెట్లో ఉంద‌ని అంటూనే ప్ర‌జ‌లకు పింఛ‌న్లు ఎలా పెంచార‌ని, డ్వాక్రా మ‌హిళ‌లకు దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వ‌ని విధంగా ప‌సుపు-కుంకుమ కింద ప‌ది వేల రూపాయ‌లు ఎలా ఇస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. మ‌రి దీనికి ఆ ఎంపీ ఏం స‌మాధానం చెప్పి ఉంటారు?  ఇదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆ వెంట‌నే స‌దరు ఎంపీ అక్క‌డి నుంచి జారుకున్నారు. 


ఏపీలో రాజ‌కీయాలే కాదు.. ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ఇలానే చింద‌ర వంద‌ర‌గా ఉంద‌నేందుకు ఆ ఎంపీ స‌మాధానం చెప్ప‌కుం డా వెళ్లిపోయిన ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ అంటూ కొన్ని ప‌త్రిక‌ల్లో వ్యాసాలు కూడా వ‌చ్చాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఏపీలో చంద్ర‌బాబు డ‌బ్బు లేద‌ని, ప్ర‌త్యేక హోదా ఇస్తే త‌ప్ప రాష్ట్రం అభివృద్ది చెంద‌ద‌ని చెబుతున్నారు. కానీ, మ‌రోప‌క్క చేతికి ఎములేకుండా వ‌రాల వ‌ర్షాలు కురిపిస్తున్నారు. కార్యాచ‌ర‌ణ‌లో పెట్టి చూపిస్తు న్నారు. మ‌రి ఇవ‌న్నీ ఎలా సాధ్యం? అంటే ప్ర‌స్తుతం వినిపిస్తున్న మాట‌... రాష్ట్రం అప్పులు చేస్తోంద‌ని! దాదాపు ఇటీవ‌ల రెండు ల‌క్ష‌ల కోట్ల మేరకు ప్ర‌భు్త్వం అప్పులు తీసుకుంది. వీటిలో స‌గాన్ని సంక్షేమానికి కేటాయించారు. 


అంటే ఇప్పుడు ఇస్తున్న పింఛ‌న్లు, ప‌సుపు-కుంకుమ వంటివి ఈ జాబితాలోకే వ‌స్తాయి. అంటే వ‌చ్చే రెండేళ్ల‌కు సంబం ధించి కూడా ప్ర‌భుత్వం ముందుగానే అప్పులు చేసేసింది. కాబ‌ట్టి రాష్ట్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా..వ చ్చే రెండేళ్ల‌లో ఈ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టుకోలేక నానా తిప్పులు ప‌డాల్సిన ప్ర‌మాదం ఉంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తు న్న మాట‌. ఎవ‌రు వ‌చ్చినా ప్ర‌జ‌ల‌కు ఇంత‌క‌న్నా చేసేది కూడా ఉండ‌దు.

పింఛ‌న్‌ను ఇంత‌క‌న్నా పెంచే సాహ‌సం కానీ, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇప్పుడున్న వాటిక‌న్నా పెంచే సాహ‌సం కానీ చేసే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ప్ర‌భుత్వాల‌పైనా ప్ర‌జ‌లు పెద్ద‌గా న‌మ్మ‌కం పెట్టుకోవ‌డం లేద‌ని జాతీయ మీడియా సూత్రీక‌రించింది. మ‌రోప‌క్క‌... వివిధ ప్రాజెక్టుల ప‌నులు కూడా మంద‌గించాయి. దీనిని ప‌రిశీలిస్తే.. రాష్ట్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. రాబోయే ఐదేళ్ల‌లో ఇంత‌కు మించి చేసేది లేద‌ని తెలుస్తూనే ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: