చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జగన్‌ చేసిన కులం ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. డీఎస్పీలుగా ప్రమోషన్ల పొందిన 37 మంది సీఐల్లో 35 మంది కమ్మ కులస్తులే అని జగన్ ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆరోపణలు నేరుగా చేయలేదు. సరిగ్గా ఎన్నికల ముందు ప్రతిపక్షనేత లేపిన ఈ కలకలం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Related image


టీడీపీ సర్కారుపై కుల పరమైన ఆరోపణలు నేరుగా జగన్ చేయడం ఆయన మళ్లీ సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అన్న వాదన వినిపిస్తోంది. సున్నితమైన ఈ కులాల ఇష్యూని టచ్ చేయకుండా ఉండి ఉండే బావుండేదని కొందరు అంటున్నారు. చంద్రబాబు సర్కారు కుల గజ్జిని అంతగా ఎండగట్టాలను కుంటే.. ఇదే ఆరోపణలు జగన్ నేరుగా చేయకుండా తన పార్టీ నేతలతో చేయించి ఉంటే కొంత వరకూ ఇబ్బంది లేకుండా ఉండేది.

Image result for CHANDRABABU CASTE


జగన్ ఆరోపణల ద్వారా ఆ సామాజిక వర్గమంతా ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మరింత బలంగా ప్రతిఘటించడం ప్రారంభమవుతుంది. అందులోనూ ఆ సామాజిక వర్గంలో ఉన్న వైసీపీ అభిమానులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు కుల గజ్జి గురించి ఇవేమీ కొత్త విషయం కూడా కాదన్న వాదన ఉంది.

Image result for JAGAN EC COMPLAINT

ఇన్నాళ్లూ ప్రైవేటు సంభాషణల్లో చేటు చేసుకుంటున్న అంశాన్ని ఇప్పుడు జగన్ మీడియా ముందు బట్టబయలు చేశాడు. దీని వల్ల రాజకీయంగా ఆయనకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈసీకి కంప్లయింట్ ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగే ప్రయోజనాలూ ఉండవు. మరో విషయం ఈ జాబితాలో ఆరోపణలు ఆయన ససాక్ష్యంగా నిరూపించి ఉండే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది.


మరింత సమాచారం తెలుసుకోండి: