కలకత్తా పోలీస్ కమీషణర్ సిబీఐ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్ట్ ఆదేసించటంతో దేశప్రజందరి దృష్టి మమత దీదీ రాజ్యం పశ్చిమ బెంగాల్ వైపు మరలింది.  అక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో అంటే సెలవు రోజున కూడా ఎవరి సెలవు వారు ఎంజోయ్ చేసుకుంటున్న వేళ పశ్చిమ బెంగాల్ లో చకచకా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు నోటిఫికేషన్ల రూపంలో మొబైల్ లోకి, స్క్రోలింగ్ రూపంలో టివిలలో, వస్తున్న వేళ,  చాలా మంది తమ పనుల్ని పక్కన పెట్టేసి మరీ,  వాటిని ఆసక్తిగా చూడటమే కాదు, నరేంద్ర మోడీకి తన దైన స్టైల్ లో ధమ్ము దర్పం తో షాకిచ్చే ప్రత్యర్థి ఎవరంటే అందరి చూపుడు వేళ్ళూ మమతా బెనర్జీని చూపించాయి. 
Image result for gautam kundu
శారదా కుంభకోణంలో కోల్-కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందు కు సీబీఐ అధికారులు ఆయన ఇంటికే వెళ్లిన నేపథ్యంలో, అక్కడి పోలీసులు వారిని అడ్డుకోవటమే కాదు వారిని జీపులో పడేసి పోలీస్ స్టేషన్ కు తీసు కెళ్లిన  అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసలు దీనంతటికి కారణం శారదా చిత్ ఫండ్ & రోజ్-వ్యాలీ కుంభకోణాలు. ఇంతకీ ఈ కుంబకోణాల నేపద్యం ఏమిటి వీటి రాజకీయ ఆర్ధిక తీవ్రత ఎంత?   ఎంత మంది ప్రజలు ఈ కుంభకోణాల కారణంగా దెబ్బ తిన్నారు? అసలీ కుంభ కోణాల అసలు చరిత్ర ఏమిటి అని పరిశీలిస్తే సంక్షిప్తంగా ఈ క్రింది పాయింట్లలో చెప్పొచ్చు.


చైన్-సిస్టంతో నడిచే పథకాలతో 200 మంది వ్యక్తులు పశ్చిమ బెంగాల్ లో శారదా గ్రూప్ పేరిట కంపెనీని స్థాపించారు.  తమ పథకాల్లో పెట్టుబడులు పెడితే వారికి భారీ లాభాలు వస్తాయని అమాయక ప్రజలకి ఆశ చూపి ఆకర్షించారు. దాదాపు ₹10000 కోట్లకు పైగా అమాయక ప్రజల కష్టార్జితాన్ని నిలువు దోపిడీ చేసిన ఈ కుంభకోణం మొదట యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2013లో వెలుగు చూసింది. మమత దీదీ ప్రభుత్వంపై నాడు కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

Image result for rahul gandhi tweets on sharada chit scam

"నాడు ప్రత్యర్ధిగా మమతా బెనర్జీకి ట్వీట్స్ ఇచ్చిన మన కాంగ్రెస్ రాజీవుడు నేడు మద్దతు నివ్వటం సిగ్గుచేటు అంటున్నారు"


దేశమంతా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన ఈ కుంభకోణం సంగతి చూసేందుకు అమాయక ప్రజల్ని ఆదుకునేందుకు వీలుగా ₹500 కోట్ల ప్రత్యేక నిధిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయ వలసి వచ్చింది.  ఈ కుంభకోణంలో పలువురు అధికార తృణమూల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు భాగస్వామ్యం ఉందంటూ తీవ్ర ఆరోపణలు రావటం అవి పోలీసుల విచారణలో కూడా నిజమే నని తేలింది.  శారదా చిట్ ఫండ్ కంపెనీ ఛైర్మన్ - ఎండీ అయిన సుదీప్ సేన్ తో గ్రూప్ కు చెందిన అనేక మంది ప్రముఖుల్ని 2013 ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పలువురు ఈ కుంభకోణంలో పాత్రదారులంటూ పోలీసుల విచారణలో వెల్లడైంది.
Image result for sharada chit and Rose vally scam
పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందార్ కూ పెద్ద మొత్తంలో ఈ కుంభకోణంలో ముడుపులు అందినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకే ఈ కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉందని దానిని బయటకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా సెబీ, ఆర్బీఐ, ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర విచారణ నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి.  


పశ్చిమబెంగాల్ మాజీమంత్రి మతంగ్ సింగ్ సతీమణి మనోరంజన్ సింగ్ పైన ఇందులో పాత్ర ఉన్నట్లుగా పిర్యాదులు నమోదయ్యాయి. ఆమెపై నమోదైన కేసుల్ని వాదించేందుకు ప్రముఖ న్యాయవాది నళిని చిదంబరం అంగీకరించిన దరిమిలా ఆమెకూ చిక్కులు ఎదురుకావటం, ఈ కేసును వాదించ టానికి ఆమె ఫీజుగా ₹1.26 కోట్ల మొత్తాన్ని తీసుకున్నారని, ఆ ఫీజ్ మొత్తం శారదా కుంభకోణం లో దోచేసిన సొమ్మే నని ఈడీ కేసు ఫైల్ చేసింది.  ఆసక్తికరమైన ఈ కేసూ కూడా ఇప్పుడు నడుస్తోంది.
Image result for nalini chidambaram
శారద చిట్ ఫండ్ కుంభకోణం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దు దాటి ఒడిశా రాష్ట్రానికి కూడా చేరింది. మమత దీదీకి అత్యంత ఆప్తుడు ప్రధాన అనుచరుడిగా ఉన్న కేంద్ర మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ ను సీబీఐ ఇప్పటికే అనేక సార్లు ఈ అంశంపై ప్రశ్నించింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.  మమత దీదీకి అండగా ఉన్నారా? ఉంటె మీ సంగతి తేలుస్తాం అన్నట్లుగా బెదిరించే ధోరణిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న మమత ఆరోపణలకు ముకుల్ రాయ్ ఉదంతమే ఋజువు అంటారు. 

Image result for mukul roy

శారదా చిట్స్ ఫండ్ కుంభకోనంలో ఇబ్బంది పడుతున్న సమయంలోనే మమత దీదీ ప్రభుత్వానికి ₹40000 కోట్ల మరో రోజ్ వ్యాలీ స్కాండల్ తెరపైకి వచ్చి మరో సంచలనంగా మారింది. ఇది కూడా శారదా చిట్స్ లాగానే చైన్-సిస్టంలో జరిగిన పథకమే. ప్లాట్ల కొనుగోలు చేయాలనుకునే వారిని, విహర యాత్రలకు వెళ్లే వారిని, లక్ష్యంగా చేసుకొని కమిషన్ పద్దతిలో, చైన్-సిస్టంలో సభ్యులుగా చేస్తారు. నిర్దేశించిన సమయం గడచిన వెంటనే డబ్బు కట్టిన వారికి 21 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపించారు. దాదాపు ₹40000 కోట్లను ప్రజల నుంచి సమీక రించినట్లుగా చెబుతున్నారు. రోజ్ వ్యాలీ సంస్థ - రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్స్ తదితర వ్యాపారాలు చేస్తున్నట్లుగా చెప్పి భారీ ఎత్తున నిధులు సమీకరించాయి.
Image result for tapas pal gautam kundu sudip bandyopadhyay
ఈ తీరులో నిధుల్ని సమీకరించటం చట్టవిరుద్దమని సెబీ పేర్కొంది. సెబీ ప్రకటనతో నిధుల సమీకరణను 2013-2014లో నిలిపివేశారు. ఈ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తపస్పాల్, సుదీప్ బందోపాధ్యాయలను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరితోపాటు రోజ్-వ్యాలీ గ్రూప్ ఛైర్మన్ గౌతం కుందు కూడా ఉన్నారు. 

Image result for gautam kundu

మరింత సమాచారం తెలుసుకోండి: