ట్విట్టర్ అకౌంట్‌తోనే సంచలనాలు సృష్టించడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటైపోయింది. ఏదో విధంగా ఎవరినో ఒకరిని కెలకడం వర్మకు రొటీన్ గా మారింది. తన కొత్త సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ ప్రమోషన్ కు పూర్తిగా ట్విట్టర్ పైనే ఆధారపడిన ఆర్జీవీ ఇప్పుడు ఇతరులనూ కెలుకుతున్నాడు.



మొన్న తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా అంటూ ఓ మార్ఫింగ్ ఫోటో పెట్డాడు వర్మ. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆ ఫోటోలో తన తలను తీసేసి లోకేశ్ ఫోటో పెట్టి వరుసగా ట్వీట్ల వర్షం కురిపించాడు. కత్తిపట్టుకున్న నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేస్తూ చిత్ర విచిత్రమైన కామెంట్లు పెట్టాడు.



నారా లోకేశ్ కత్తి పట్టిన ఫోటో తనకు అమితంగా నచ్చిందంటున్నాడు ఆర్జీవీ. దావూద్ ఇబ్రహీం, ఒసామాబిన్ లాడెన్ కంటే కూడా తనకు నారా లోకేశ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడని సైటైర్లు పేల్చారు. అంతటితో ఆగకుండా లోకేశ్ కూ తారక్‌ కూ ముడిపెట్టి కామెంట్లు చేశాడు.

Image result for lokesh rgv


అరవింద సమేత సినిమాలో తారక్ బదులు లోకేశ్ ను హీరోగా పెట్టి ఉంటే.. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదన్నారు ఆర్జీవీ. లోకేశ్ మాంచి హీరో కాకుండా పాలిటిక్స్ లోకి వెళ్లి అనవసరంగా తన టైమ్ వేస్టు చేసుకుంటున్నాడని సానుభూతి కురిపించాడు ఆర్జీవీ. అలాగే నారా లోకేశ్ సంబాషణా చాతుర్యం కూడా అద్భుతమంటూ పొగిడాడు వర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: