రాష్ట్రంలో 52% మంది ఉన్న బీసీల‌కు రాజ‌కీయ ప్రాధాన్యం భారీగా పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరు ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తే.. వారే అధికారంలోకి వ‌చ్చే సూచ‌ల‌ను స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిని ఆక‌ట్టుకునేందుకు అన్ని ప్ర‌ధాన పార్టీలూ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నాయి. పూర్తిగా దిక్కులేని ప‌రిస్థితికి చేరుకున్న కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వ‌స్తే.. బీసీల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, బీసీ నేత‌ను సీఎం చేస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించిం ది. ఇక‌, ఇదే త‌రహాలో కాక‌పోయినా అధికార పార్టీ టీడీపీ కూడా బీసీల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తోం ది. బీసీ కార్పొరేష‌న్‌కు నిధులు కురుపించింది. వారికి కులాల వారీగా అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలుఅమ‌లు చేసేందుకు మార్గాన్ని సుగ‌మం చేసింది.

Image result for chandrababu naidu

బీసీల్లో అత్యధికంగా వున్న సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ వీరందరి సంక్షేమానికి వారు కోరుకున్నట్టు గానే కార్పొరేషన్లను ప్రకటిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వరాలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ అమలులోకి వస్తాయని పేర్కొంటూనే.. వీటన్నింటి ఫలి తంగా సుమారు మూడు వేల కోట్లు వ్యయం అవుతుం దని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఒక పక్కా ప్రణా ళిక ప్రకారమే ఆచరణ యోగ్యమైన హామీలనే సీఎం చంద్రబాబు బీసీలకు అందించారనే వాదన వినిపించింది. అంతకంటేమించి ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామని చేసిన ప్రకటన కాస్తా బీసీ వర్గాల‌ను ఆకర్షించింది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏర్పాటు చేసిన సబ్‌ ప్లాన్‌ వల్ల నిధులు వచ్చేవి. పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నా.. సబ్‌ప్లాన్‌ లేకపోవడంతో నిధుల కొరత ఉండేది. అయితే, తాజా బ‌డ్జెట్‌లో బీసీల‌కు కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

Related image

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. బీసీల‌కు బాబు చేసింది ఏమీ లేద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ఆయ‌న భారీ ఎత్తున స‌బ‌లు పె ట్టి వైఎస్ గ‌తంలో బీసీల‌కు చేసిన మేళ్ల‌ను ఏక‌రువు పెడుతున్నారు. ఇక‌, తాను అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌తి ఒక్క‌రికీ పిం ఛ‌న్లు 45 ఏళ్ల వ‌య‌సు నుంచే ఇస్తామ‌న్నారు. అయితే, బీసీల విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌ మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా కులాల వారీగా రాజ‌కీయాలు చేయ‌డం త‌న‌వ‌ల్ల‌కాద‌ని ఆయ‌న ముందునుంచి ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీసీలు నిజంగానే రాజ‌కీయంగా విడిపోతే.. ఏ పార్టీకి మ‌ద్ద‌తిస్తార‌నే చ‌ర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. పైకి చంద్ర‌బాబు కుల రాజ‌కీయాలు చేస్తున్నాడంటూ..జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నా.. అంత‌ర్గ‌తంగా ఆయ‌న కులాల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు మాత్రం స‌ఫ‌లం అయ్యాయ‌న‌డంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీసీల్లో మెజార్టీ వ‌ర్గాలు టీడీపీకే జైకొడుతున్నారు. అదే టైంలో ఈ వ‌ర్గంలో ప‌ట్టున్న కొన్ని కులాలు బాబుపై అసంతృప్తితోనూ ఉన్నాయి. మ‌రి ఎన్నిక‌ల స‌మయానికి ప‌రిస్థితి ఎలా మారుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: