ప్రధానమంత్రి మోడీ గుంటూరు పర్యటన మోడీ- బాబు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేర్చింది. ఇప్పటి వరకూ పొలిటికల్ లెవల్లో జరిగే విమర్శల యుద్ధాలు ఇప్పుడు పర్సనల్ రేంజ్ కు దిగజారాయి. మోడీ పేరు చెబితేనే మండిపడుతున్న చంద్రబాబు ఇప్పుడు విమర్శల్లో కొత్తపుంతలు తొక్కుతున్నారు.



గుంటూరులో మోడీ మీరే సీనియర్ అంటూ చంద్రబాబుపై చేసిన ఘాటు విమర్శలు ఆయనలో సహనాన్ని చంపేసినట్టున్నాయి. మోడీ పై చంద్రబాబు ఆక్రోశం ఆయనలో వివేకాన్ని కూడా పక్కకుపెట్టేసినట్టుంది. ఎన్నడూ లేనిది చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు. లోకేశ్ ఎదుగుదల కోసం చంద్రబాబు ఏపీని బలిపెడుతున్నారన్న కామెంట్లపై రివర్స్ పంచ్ విసిరారు.



తన కుటుంబాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందంటున్నారు చంద్రబాబు. తన కుటుంబం తనపై ఆధాపడిలేదట. కానీ మీకు కుటుంబం లేదు. బంధాలు లేవు.. కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదు.. మీ భార్య యశోదాబెన్ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు..గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుందంటూ ఘోరంగా రెచ్చిపోయారు చంద్రబాబు.

Image result for chandrababu audio tape


ఇలా మోడీ భార్య గురించి చంద్రబాబు కామెంట్ చేయడం ఆయన అభిమానులకు కూడా నచ్చేలా లేదు. మోడీ భార్య గురించి మాట్లాడితే ఓకే.. కానీ అదే మోడీ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చంద్రబాబుకు.. ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికింది నువ్వే కదా బాబూ అని మోడీ నిలదీస్తే చంద్రబాబు తలఎక్కడ పెట్టుకుంటారో.. ఆయనకే తెలియాలంటున్నారు మోడీ అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: