బీజేపీ - టీడీపీ సాన్నిహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రహస్య కాపురం గుట్టు బజార్న పడింది. జనం ముందు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న వారి రహస్య సంసారాన్ని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా బయటపెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి వెళ్ళటానికి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రత్యక్షమయ్యారు. 


ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్‌ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ తీరును ఎండగట్టారు. 


 పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు &కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టు. ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?

Vijaya Sai Reddy Reveals BJP And TDP Secret Relation - Sakshi 

ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు రూ.200కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదు.ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెట్టాడు.సొంత పనులకు హెలికాప్టర్,విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.


హైదారాబాద్ లో మెట్రో రైల్ మొదలై ఏడాది దాటింది. అంతకంటే ముందే కూత పెడుతుందన్న అమరావతి-విజయవాడ మెట్రో భూగర్భంలో నడుస్తోందా? అంతరిక్షంలో తిరుగుతోందా? గ్రాఫిక్స్ కూడా దండగ అనుకుని కొన్ని ప్రాజెక్టులను ట్విట్లర్ కే పరిమితం చేసినట్టున్నారు చంద్రబాబు!


ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మ పోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ₹200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కులమీడియాకు వేల కోట్లు దోచి పంచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్‌, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.



మరో ట్వీట్‌లో  లోకేష్‌ బాబుకి ఇండిపెండెన్స్‌ డేకు రిపబ్లిక్‌ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్‌ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో  గ్రేడ్ - ఏ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: