మ‌న‌ను ప‌ట్టించుకోని వారికి మ‌ర్యాద‌లా?. మ‌న‌ల్ని క‌నీసం క‌న్నెత్తి చూడ‌ని వారికి ఆహ్వానాలా? ఇలా అయితే ఎలా జ‌గ‌న్‌?!- ఇప్పుడు ఇవే సోష‌ల్ మీడియాలో ట్రండ్ అవుతున్నాయి . ఇటీవ‌ల గుంటూరుకు వ‌చ్చిన ప్ర‌ధాని నరేంద్ర మోడీకి ఉద్దేశ పూర్వ‌కంగా నే చంద్ర‌బాబు ఆహ్వానం ప‌ల‌క‌లేదు. ప్రోటోకాల్‌ను సైతం ఆయ‌న ప‌క్క‌కు పెట్టి క‌నీసం ఆహ్వానం కూడా ప‌ల‌క‌లేదు. క‌నీసం మంత్రుల‌ను సైతం పంప‌లేదు. కేవ‌లం అధికారులు మాత్ర‌మే వెళ్లి ప్ర‌ధానిని క‌లుసుకుని క‌ర‌చాల నం చేశారు. అయితే, ఇదంతా కూడా ఏపీ ప్ర‌జ‌ల‌కు మోడీపై ఉన్న ప‌గేన‌ని చెప్పి.. స‌క్సెస్ అయ్యారు చంద్ర‌బాబు. ముఖ్యంగా విభ‌జ త‌ర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవ‌డంలో మోడీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పారు. 

Image result for modi meeting guntur

అందుకే తాను వెళ్లి అలాంటి నాయ‌కుడికి ఆహ్వానం చెప్ప‌న‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనిని ప్ర‌జ‌ల్లోకి కూడా బ‌లంగా తీసుకు వెళ్లారు. అంత‌టితో ఆగ‌కుండా..మోడీ రాష్ట్రానికి వ‌చ్చిన రోజున న‌ల్ల‌చొక్కా ధ‌రించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు ఇక‌, రాష్ట్రంలో ప‌లు పార్టీలు ఆందోళ‌న చేసేలాతెర చాటు వ్యూహాన్ని కూడా అమ‌లు చేయించారు. ఇలా మొత్తానికి ప్ర‌జ‌ల సెంటిమెంటును దాదాపు త‌ను ఓన్ చేసుకున్నారు చంద్ర‌బాబు. ఇక‌, ఇదే విష‌యంపై మొద‌ట్లో పోరాడిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు మాత్రం వ‌దిలేశారు. అంతేకాదు, తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాష్ట్రానికి వ‌స్తే.. చంద్ర‌బాబు ఆహ్వానం ప‌ల‌క‌క‌పోవ‌డంపై ఆయ‌న త‌న నేతల‌తో కామెంట్లు చేయించారు. 

Image result for modi meeting guntur

దీంతో ఒక్క‌సారిగా ప్ర‌జ‌లు వైసీపీపై విరుచుకుప‌డుతున్నారు. చంద్రబాబు ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. బాబు తీరు ఆంధ్రుల పరువు తీసే విధంగా ఉందన్నారు.ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా? అని ఆనం ప్రశ్నించారు.ఏపీకి మోడీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి, ఏం కావాలో చెప్పాలని ఆనం సూచించారు.
Image result for ఆనం రామనారాయణరెడ్డి
చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమన్నారు. కనీసం మోడీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్‌ అధికారులు, మంత్రులు వెళ్లలేదని, ఇంతకంటే దుర్మార్గం లేదని ఆనం అన్నారు. ప్రధాని మోడీని చంద్రబాబు అవమానించారని చెప్పారు.- దీనిపైనే నెటిజ‌న్లు.. కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలా అయితే, ఎలా జ‌గ‌న్ అని ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే క‌దా!! ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తేనే క‌దా రాజ‌కీయం అంటే!! 


మరింత సమాచారం తెలుసుకోండి: