మన సంస్కారం సంస్కృతి మన గృహం నుండే ప్రారంభమౌతుంది. దాన్ని బట్టి మన సంస్కారం వగైరాలు బయట పడి వాళ్ళింతే అంటాం!  చంద్రబాబు అండ్ కో అన్నీ స్వార్ధ ప్రయోజనాలు కేంద్రం నుండి పొంది నేడు కేంద్రాన్ని నరేంద్ర మోడీని అసహ్యకర పదజాలం వాడుతూ మాట్లాడటం క్షమార్హం కాదు.
modi comment lokesh father కోసం చిత్ర ఫలితం

స్వంత  ప్రయోజనాలు పిండుకోవటం పూర్తయ్యింది. కేంద్రం నుండి ప్రత్యేక పాకేజీ పొందారు దానికి చంద్రబాబు శాసనసభ తీర్మానం ప్రధాన సాక్ష్యం. అయితే నిండు శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమా? వెంకయ్యనాయుడు గారికి పలుచోట్ల సన్మానించిన విషయం అబద్ధమా? అయితే ప్రత్యేక పాకేజీ సొమ్మేమైంది? ఇది ప్రజలు అడుగుతున్న సమాచారం. అది మోడి-బాబుల సొమ్ముకాదు కదా! 


ప్రతిపక్షం వైసిపి ప్రత్యేకహోదా అగ్నిని చల్లారనివ్వలేదు. జనసేన ఆజ్యం పోసింది. జగన్ ఉదృతం చేశారు. ఒకనాడు ప్రత్యేక హోదా అన్న ప్రతి ఒక్కణ్ణి తన్ని, వీపు పగలగొట్టి జైళ్ళలో తోశారు. చివరకు జగన్ రగిల్చిన అగ్నిలో మసవ్వటం తప్పదని తెలిసింది. ఇంకేం ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎన్నికల కోసం మడమ తిప్పారు నాలుక మడతేశారు యూ-టర్న్ లెన్నైనా తీసుకుంటూ ఉన్నారు.



నరేంద్ర మోడీ లొకేష్ తండ్రి గురించి మాట్లాడిన తీరు అసహ్యంగా మాత్రం లేదు. ఆలోచనలను తట్టిలేపింది. ప్రజలలో చంద్రబాబుపై ఉన్న ప్రచారాలు నిజమేనని ఖచ్చితంగా అనుకునేలా చేశారు. అయితే నాలుగేళ్ళు నరెంద్ర మోడీ బిజెపితో అంటకాగిన చంద్రబాబును నరెంద్ర మోడీపై, మోడీ తల్లిపై, భార్యపై చేసిన వ్యాఖ్యలు భవిషత్తులో చంద్రబాబును కట్టి కుడిపేది ఖాయం. 


లోకెష్ పదవిలోకి చంద్రబాబు చేత తీసుకురాబడ్దాడు. తల్లి హీరాబెన్ కు గాని భార్య జసోదా బెన్ కు గాని నరెంద్ర మోడీ పదవు లు కట్టబెట్టలేదే! అయితే కుటుంబ బంధాలు మోడీకి లేవని చంద్రబాబు వెటకారం చేశారు. మరి మీ కుటుంబ బంధాలు ప్రజలకు నిష్ప్రయోజనమే కదా! రాజకీయల్లోకి వారంతా వస్తూనే ఉన్నారు. ఆఖరకు సినిమాకు వినోదపన్ను ప్రయోజనం కూడా మీ బామ్మర్దే పొందాడు కదా! వీళ్ళు ప్రజలకే కాదు సినిమా రంగానికే భారం కాదా! మోడీ ఆ పని చేయలేదు. ప్రజల్లోకి వచ్చాడు కాబట్టే మోడీయే కాదు ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు హీరాబెన్ గారిని జసోదా బెన్ గారిని ఈ రొచ్చులోకి తీసుకు రావటం ఎప్పటికైనా ప్రశ్నార్ధకమే! 



మీరు మీ మామగారికి వెన్నుపోటు వేసిన నాడు మీకు దాని తీవ్రత కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు అధికారమనే తిమ్మిరి మిమ్మల్ని స్పర్శ కోల్పోయేలా చేసింది. ఇప్పుడు ఆ వెన్నుపోటే మిమ్మల్ని వేటాడబోతుంది. ప్రయివేటుగా ఉన్నంత  వరకే మీ జీవితం మీది పబ్లిక్ లోకి వస్తే ఎమైనా అంటాం! అన్నారు మహాకవి శ్రీశ్రీ! 



implementation committee of demonetisation convenor కోసం చిత్ర ఫలితం



చంద్రబాబు తల్లిగారు తన మనవడు లోకెష్కు కోట్లాది రూపాయిల విలువైన ఆస్తులు యిచ్చారు. అలాగే దేవాన్ష్ పుట్టగానే రెండుపదుల కోట్లకు అధిపతిని చేశారు. మీరు మీ కుమారుడు భార్యల సంపాధనపై జీవించే పరాన్నజీవులని మీ ఇద్దరే పలుమార్లు బహిరంగ సభల్లో చెప్పుతూనే ఉన్నారు. మీ కుటుంబ సభ్యులకు క్యూలో నిలబడాల్సిన పనిలేదు. 



కుటుంబ సభ్యులకు క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా చేసింది చంద్రబాబే కావచ్చు ఎందుకంటే పెద్ద నోట్ల రద్ధు అమలు చెసే కమిటీకి కన్వీనర్ చంద్రబాబే కదా! అసలు కొందరైతే  డిమోనెటైజేషన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ కన్వీనర్  చంద్రబాబు అనుకుటున్నట్లు  వైఫల్యమే అయితే అది చంద్రబాబు బాధ్యతా వైఫల్యమే నంటున్నారు కొందరు విశ్లేషకులు. 

chandrababu comments on heeraben modi కోసం చిత్ర ఫలితం

నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ గారికి క్యూలో నిలబడటం కొత్తగాదు. దానికి నరేంద్ర మోడీ ప్రధాని కావటానికి పెద్ద తేడాబడదు. అందుకే నరేంద్ర మోడీ తల్లైనా అందరి లాగానే ఆమె క్యూ లో నిలబడింది. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధాని. 2019లో ప్రధానిగా ఉన్నా,  2024లో బిజెపి సిద్ధాంతాల ప్రకారం  పదవి నుండి దిగిపోవచ్చు. అప్పుడు కూడా ఆయన తల్లి కుటుంబ సభ్యులు క్యూలోనే నిలబడి వారి పనులు వారు నిర్వహించుకోవాలి.

సంబంధిత చిత్రం

ఎందుకంటే మోడీ జీవన విధానమే అంత. ఆయన నేహౄ గాంధి వాధ్రా నారా కుటుంబాల్లా పదవులకు అంటి పెట్టుకొని ఉండరు. వీరికి రాజకీయమే జీవితం రాజకీయమే వ్యాపారం. మోడీకి రాజకీయం ఆశయం, వ్యాపకం, పాషన్. మానసిన ఆనందం. అందుకే మోడీ చూసేది క్రింది స్థాయి జీవితాలను సాధారణ స్థాయికైనా తీసుకు రావటం. దానికి డబ్బు కావాలి. అందుకు మన బాబులు కోరితే అపాయింట్మెంట్ యివ్వకపోవచ్చు. అర్ధరాత్రి భారత్ లో పెట్టుబడి పెడతానంటే బిల్ గేట్స్ దగ్గరికైనా వెళ్ళి చేతులు కట్టుకొని ఆహ్వానిస్తారు. తేడా కొడితే జింగ్ ను కూడా ఢీ కొంటారు.

chandrababu laxurious house with family కోసం చిత్ర ఫలితం

ఎందుకంటే ఆయన పోతే ఆయన కొచ్చే నష్టం ఏమీ లేదు. దేశం బాగుంటే చాలు! నిరుపెదరికం అనుభవించి అందులో నుంచి పైకి లేచిన క్షిపణి నరెంద్ర మోడీ - అందుకే అమ్మ అన్నం వండి పోయ్యిని గొట్టంతో ఊదుతూ ముఖంపై బూది నుసి పడిన తల్లి ముఖం చూసిన తనయుడు. అందుకే కాంగ్రెస్ దాదాపు ఆరు దశాబ్ధాల్లో చేయలేని ప్రజా సేవ పదవిలోకి రాగానే పదమూడు కోట్ల గాస్ కనక్షన్లు అందిస్తూ మాతృమూర్తులు, సోదరీమణుల ఆర్తి తీర్చే పనిలో పడ్డారు. తన బావ చెల్లెళ్ళు చేసిన ఆర్ధికనేరాలను కప్పి పుచ్చటానికి రాజకీయాల్లోకి రాలేదు. తన కొడుకును తన తరవాత ముఖ్యమంత్రిని చేయటానికి ప్రయత్నించలేదు. హెరిటేజ్ లాంటి వ్యాపార సంస్థలను భార్యా కోడళ్లతో నిర్వహింపజేస్తూ వారికి రాజకీయ రక్షణవలయం కలిపిస్తూ దేశంలోని డైరీ వ్యవస్థలను పాడి పాల పరిశ్రమలను నిర్మూలించలేదు. సహకార సంఘాలను ఆచూకి లేకుండా చేయలేదు.

lal bahadur Sastry & Narendra Modi కోసం చిత్ర ఫలితం

భారత్ గుర్తుంచుకోవలసిన ప్రధాన మంత్రులు ఇద్దరు మాత్రమే ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి, మరొకరు నరేంద్ర మోడీ. ఇద్దరూ పాతాళం నుండి ఆకాశం వైపుకు దూసుకు వచ్చినా జీవితాన్ని మార్చుకోలేదు. ఏదైనా మార్పు వచ్చినా అది దేశం అవసరాలకు ప్రాతినిధ్యం సరిగా ఉంచటానికే.  అది కొడుకు పదవి వలన వచ్చిన మార్పు కాదు! దాన్ని రాహుల్ గాంధి చంద్రబాబు ఎత్తిపొడవ అక్కర్లేదు. ఒకరు బంగారు చంచా నోట్లో ఉండి పుట్టారు. మరొకరు వెన్నుపోట్లతో బంగారు చంచా నోట్లో పెట్టుకున్నారు. క్షేత్ర స్థాయి నిజాలు తెలిసిన శాస్త్రీ-మోడీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అనేది నమ్మకూడని విషయం.


మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చంద్రబాబు 2019లో అధికారంలొకి రారని చెపుతున్నారు విశ్లేషకులు సర్వే సంస్థలు. ఒకవేళ చంద్రబాబు అధికారం లోకి వస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉంటే మరోసారి ఏపి ప్రజలకు మరో ఐదేళ్లు ఇబ్బందులు తప్పవు. అంతే కాదు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాహుల్ గాంధి ప్రత్యేక హోదా యివ్వలేకపోవచ్చు. కారణం బిహార్ ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు తమిళనాడు పశ్చిమ బెంగాల్ కూడా ప్రత్యేక హోదా కోరే అవకాశాలు పుష్కళంగా ఉంటాయి.   


నరెంద్ర మోడీ ఈ జాతికి నేర్పింది స్వచ్చ భారత్. అది ఇప్పుడు క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం గ్రామీణ నరేంద్ర మోడీ జీవితంలో నిద్రాణంగా ఉన్న శుచి శుభ్రతపట్ల ఉన్న విలువలు. అంతే కాదు విశ్వానికే భారతీయ యోగ విద్య ప్రచారం చేసి నేర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ గురించి అంత హేళనగా, అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబు సంస్కారమా! 


ప్రజలకు కావలసింది సంపద సృష్టికాదు సమర్ధపాలన. వ్యవస్థల సృష్టి. ప్రతి వ్యవస్థ పలితాలను ప్రజోపయోగం కావిస్తాయి చంద్రబాబు ఒకసారి ప్రజల్లోకి మారువేషంలో వెళ్ళి చెక్ చేసుకుంటే ఈయన దుర్మార్గాల గురించి జనం కోట్ల నోళ్లతో చెపు తున్నారు. చంద్రబాబులో ప్రవహించేది రక్తం కాదు కరుడు గట్టిన స్వార్ధమని. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: