ఏపీ సీఎం ప్ర్యత్యేక హోదా కోసం పోరాటమంటూ ఢిల్లీలో రెండు రోజులపాటు సాగించిన ధర్మపోరాటం సీన్ లో చాలా చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రాభవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆమేరకు ర్యాలీ ప్రారంభమైన సమయంలో ఓ చిత్రం చోటు చేసుకుంది.

Image result for chandrababu rally in delhi


ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెప్పుకునే శివాజీ చాలా దూరం చంద్రబాబు పక్కనే నడిచారు. చాలా సేపు చంద్రబాబుతో మాట్లాడుతూ అడుగులు వేశాడు. ప్రత్యేక హోదా మా హక్కు అంటూ విపరీతమై ఆవేశంతో నినాదాలు చేశాడు. అంతవరకూ బాగానే ఉంది.

Related image


కానీ ఆ తర్వాత ఏమైందో.. కానీ. ఏకంగా చంద్రబాబుతోనే పెద్ద పెద్దగా అరుస్తూ వాదించడం ప్రారంభించాడు. నినాదాల హోరు మీడియా హడావిడిలో ఆ వాదన ఏంటో అర్థం కాలేదు కానీ.. ప్రత్యేక హోదా హామీ అండీ.. అది హక్కు కాదు.. అంటూ చంద్రబాబుతో వాదన వేసుకున్నారు.

Image result for chandrababu rally in delhi


ఏదో విషయం మీద చంద్రబాబుతో వాదనకు దిగారు. మీరు అలా ఎలా చేస్తారన్నట్టుగా నిలదీస్తూ మాట్లాడాడు కూడా. పాపం చంద్రబాబు మాత్రం ఆయన వాదన వింటూ అప్పుడప్పుడూ కాస్త ఆయనకు వివరణ ఇస్తూ ముందుకు సాగిపోయారు. చంద్రబాబు అపాయిట్ మెంట్ దొరకడమే కష్టమైన శివాజీకి.. ఆయనతో వాదించే అవసరం ఎందుకు వచ్చిందో.. ఏమో..


మరింత సమాచారం తెలుసుకోండి: