నోటు కు ఓటు కేసులో మళ్లీ వేడి మొదలైంది. తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలుకు ఆఫర్ చేసిన ఏభై లక్షలతో పాటు, మిగిలిన నాలుగున్నర కోట్లకు సంబందించిన వివరాలు సేకరిస్తోంది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్ర రెడ్డి నుంచి తెలుసుకోవడానికి ఈడి ప్రయత్నించింది.

Image result for chandrababu revanth note for vote case


వేం నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారులను కూడా విచారించింది. నోటుకు కోట్లు కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమారుల్ని ఈడీ విచారణకు పిలవడం బాధాకర మని నరేందర్ రెడ్డి అంటున్నరాు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. వారు కోరిన డాక్యుమెంట్లు సైతం అందించాను. మరోసారి పిలిచినా హాజరవుతాను అన్నారు.

Related image


మరోవైపు ఇదే కేసులో రేవంత్‌రెడ్డి సైతం త్వరలో విచారణకు హాజరుకానున్నారు. ఆయన ఈ నెల పందొమ్మిదిన ఈడి ఎదుట హాజరు కావల్సి ఉందని చెబుతున్నారు. వేంనరేందర్ రెడ్డి, ఆయన కుమారులు ఈడీ విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది.



ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఆలోచన కేంద్రం చేస్తుందా అన్న అనుమానాలు టీడీపీ నేతలకు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆడియో రికార్డులు ఉన్నందున కక్ష సాధింపు అని చెప్పేందుకు కూడా వీలుండదు. మోడీకి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతున్న చంద్రబాబు కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: