గత కొన్ని రోజులుగా దేశంలో టీవి విక్షకులను కలవర పెడుతున్న కొత్త టారిఫ్ విధానం రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది.  సుప్రీంకోర్టు  ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెను భారం పడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు.  కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావాల్సిన ఛానెల్‌ను ఎంచుకుని దానిని కొనుక్కోవాలన్నారు. ఇతర ఛానెల్స్‌తో పోలిస్తే తెలుగు ఛానెల్స్ ఎక్కువ ధర చెబుతున్నాయని వారు తెలిపారు.

ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
ఇదిలా ఉంటే టీవీ వీక్షకులకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ  ట్రాయ్ శుభవార్త చెప్పింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం చానళ్లు ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగించింది. వాస్తవానికి గత నెల 31 తో ముగిసిపోయింది..కానీ చానళ్లు ఎంపిక చేసుకోవడంలో వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువును పొడిగించింది.  దీనికి కారణం వినియోగదారులకు కేబుల్ ఆపరేటర్లు సరైన అవగాహ కల్పించకపోవడం వల్లే  ఈ పరిస్థితి తలెత్తినట్టు ట్రాయ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ సర్వీసులు 6.7 కోట్ల డీటీహెచ్ సర్వీసులు ఉన్నాయి.
Image result for tv channels pay
ఈ నేపథ్యంలో వినియోగదారులు తమకు నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ట్రాయ్ పేర్కొంది.  అందుకే గడువు పొడిగించి వారికి సరైన అవగాహన కల్గిన తర్వాత బెస్ట్ ఫిట్‌ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. కాగా,  ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తాము చూసే చానళ్లకు మాత్రమే ధర చెల్లించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: