ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత కురు వృద్ధ భారత రాజకీయనేత ములాయం సింగ్ యాదవ్,  సొంత పార్టీతో పాటు విపక్షాలకు పార్లమెంట్ సాక్షిగా భలే షాక్ ఇచ్చారు.  బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గట్టిగా వ్యతిరేకించే ములాయం సింగ్ యాదవ్, మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలంటూ లోక్‌సభ లో తెలిపారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ చైర్‌-పర్సన్ సోనియా గాంధీ సహా ఇతర ముఖ్యనేతలంతా లోక్‌సభలో ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 
mulayam wants to become PM again కోసం చిత్ర ఫలితం
మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలంటూ వ్యాఖ్యానించిన ములాయం సింగ్ యాదవ్ అన్ని పార్టీలను కలుపుకుని పోవడంలో మీరే సమర్థులంటూ నరేంద్ర మోదీని పొగిడారు. ఆయన పరిపాలన బాగుందని పొగిడారు. మీ వెంటే మేము ఉంటామని ములాయం సింగ్ యాదవ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా, ఈ సమయంలో ములాయం సింగ్ యాదవ్ పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం షాక్ తిని ముభావంగా ఉండి పోయారు. అయితే ఆమె మాత్రం నిర్ఘాంతత నుండి కోలుకున్నట్లు కనిపించలేదు. 
MUlayam in LS today with shocking comments on Modi కోసం చిత్ర ఫలితం
ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికి గురికాగా, అధికార పార్టీ ఎంపీలు సంతోషంలో మునిగిపోయారు. ములాయం ప్రశంసిస్తుండగా నరేంద్ర మోదీ చిద్విలాసంగా చిరునవ్వులు చిందించారు. తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారు. నరేంద్ర మోదీని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేసారు. 
Mulayam comments on Modi shocks sonia & Rahul కోసం చిత్ర ఫలితం
మరోసారి ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలతో తాను అంగీకరించ బోనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే దీనిపై ములాయం తనయుడు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏ రకంగా స్పందిస్తారన్నది ఇప్పటికి మాత్రం ఆసక్తి కలిగించేలాగే ఉంది.  బీజేపీకి వ్యతిరేకంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో జట్టు కట్టిన ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న అఖిలేష్ యాదవ్‌ కు తండ్రి ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించే పరిణామమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత చిత్రం
లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లో పోటీ అంతా ఎస్పీ-బీఎస్పీ కూటమి, బీజేపీ మధ్యే ఉండబోతుంది అన్న వార్తల నేపథ్యంలో, ములాయం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించు కున్నాయి.  
బహుశ ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధి నెహౄ వాధ్రా ప్రవేశ ప్రభావం కావచ్చని-దీని వెనక మాయా-అఖిలేష్ లేకుంటే చాలని కాంగ్రెస్ అభిమానులు భావిస్తు న్నారు. కాలం మాత్రమే మున్ముందు ఏం జరుగుతుందో చెపుతుంది అంతవరకు ఎదురుచూద్ధాం! 

  smiling modi in LS కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: