విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి యూపిఏ ప్రభుత్వం హామీ ఇవ్వగా అందుకు సమ్మతం పలికింది బీజేపీ.  ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏపికి ఇస్తామన్న ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వలేదు.  దాంతో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.  అయితే కొంత కాలంగా పార్లమెంట్ లో టీడిపి ఎంపీ, నటుడు శివప్రసాద్ చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. 
Image result for modi
ఈ నేపథ్యంలో లోక్ సభ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ శివప్రసాద్ పై ప్రశంసలు కురింపించారు. శివప్రసాద్ చాలా మంచి నటుడని మోదీ కితాబిచ్చారు.  ఆయన ఇప్పటి వరకు ఎన్నో విచిత్రమైన వేషాలు వేస్తూ..అందరిని నవ్వించేవారని అన్నారు. తాను సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా.. శివప్రసాద్ ను చూడగానే అన్నీ మరిచిపోతానని వ్యాఖ్యానించారు.

కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శివప్రసాద్ ఘాటుగా స్పందించారు. మోదీ నాకు అద్భుతమైన ప్రశంస ఇచ్చారు. అందరిని ఎగతాళి చేసినట్లు కళను కూడా ఎగతాళి చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు పోరాటానికి మద్దతుగా హోదా కోసం నా వంతు కృషి చేశా... వేషధారణలో గిన్నిస్ రికార్డు నాకు అవసరం లేదు. ప్రజలకు మేలు జరిగి వారి ప్రేమ ఉంటే చాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపి శివ ప్రసాద్.


మరింత సమాచారం తెలుసుకోండి: