ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష వైసీపీ టీడపీపై రాజకీయంగా అనేక అంశాల్లో విరుచుకుపడుతోంది. కొత్తగా ఆ పార్టీ సామాజిక వర్గాల అంశాన్ని ప్రముఖంగా విమర్శల్లో తీసుకువస్తోంది. చంద్రబాబు కేవలం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.



ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. గవర్నర్ వద్దకు కూడా వెళ్లి కంప్లయింట్ చేశారు. ఇక ఆ పార్టీ నేత బుగ్గన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు హయాంలో కీలక పోలీస్ పోస్టింగులు పొందిన వారి జాబితా చదివి వినిపించారు.



ఇటీవల ఆ పార్టీని వీడిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ వంటి వారు కూడా చంద్రబాబుపై కులపరమైన ఆరోపణలు చేసారు. కేవలం సొంత కులానికే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కూడా సేమ్ ఇష్యూను తెరపైకి తెస్తోంది.

Related image


తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. వైసీపీ పార్టీ సంగతేంటని ప్రశ్నించారు. ఆ పార్టీ జిల్లా సమన్వయకర్తల్లో చాలావరకూ రెడ్డి కులస్తులే ఉన్నారు కదా మీ సంగతేంటని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో ఒకటి, రెండు మినహాయించి అన్నిజిల్లాల సమన్వయకర్తలూ రెడ్డి కులస్తులేనని విమర్శించారు. మరి వైసీపీ ఏం సమాధానం చెబుతుందో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: