కే ఏ పాల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న పేరు. ఈయన రాజకీయ పార్టీ పెట్టి ఎన్ని సీట్లు సంపాదిస్తాడో ఏమో గానీ.. సోషల్ మీడియాను మాత్రం ఏలేస్తున్నాడు. మొదట్లో ఈయన్ను అంతా ఓ కామెడీ పీస్ అనుకున్నా.. ఆయన వాగ్దాటి మాత్రం ఆశ్చర్యపరుస్తోంది.

ka paul కోసం చిత్ర ఫలితం

తెలుగులో నెంబర్ వన్ ఛానల్ గా పేరున్న మెరుగైన సమాజం ఛానల్ ఇటీవల కే ఏ పాల్ ను తరచుగా డిస్కషన్లకు పిలుస్తోంది. రీసెంట్ గా ఓ డిస్కషన్లో కేఏ పాల్ ఆ ఛానల్ యంకర్లను ముప్పుతిప్పలు పెట్టించాడు. యూట్యూబ్ యాంకర్ శ్వేతారెడ్డికి టికెట్ ఇచ్చి మోసంచేశారన్న ఆరోపణలపై మెరుగైన సమాజం యాంకర్లకూ కే ఏ పాల్ కూ హాట్ హాట్ డిస్కషన్ సాగింది.

ka paul కోసం చిత్ర ఫలితం


మొదట్లో కే ఏ పాల్‌ తో లేడీ యాంకర్ చర్చ ప్రారంభించింది. ఈ చర్చలో కే ఏ పాల్ దే పై చేయి అవుతోంది. ఈ సమయంలో కే ఏ పాల్ ను లేడీ యాంకర్ సరిగ్గా డీల్ చేయలేకపోతోందని భావించాడో ఏమో.. ఆ ఛానల్లో బాగా పేరున్న యాంకర్ హఠాత్తుగా తెరపైకి వచ్చాడు. కే ఏ పాల్ పై అరుపులు కేకలతో ఆరోపణలు గుప్పించాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేద్దామనుకున్నాడు.



విచిత్రం ఏంటంటే.. కే ఏ పాల్ ను బుక్ చేద్దామని వచ్చి.. ఆయనే బుక్కయ్యాడు. అడిగిన ప్రతి ప్రశ్నకూ కే ఏ పాల్ కూల్‌ గా సమాధానం చెబుతుండటంతో యాంకర్ కు బీపీ పెరిగిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు. దీంతో ఈ యాంకర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ లో ఈ వీడియో కింద 2 వేల కామెంట్లు వస్తే.. అందులో అన్నీ ఆ యాంకర్ తీరుని తిడుతూ పెట్టినవే కావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: