మహానటుడు మహానాయకుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం దివంగత నందమూరి తారక రామారావు జీవన చిత్రం (బయోపిక్) నిర్మాణం అంటే సంచలనాలకు కేంద్ర బిందువు కావాలి. కాని చప్పగా, చప్పిడిగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా బృందం, సినిమా విడుదలకై ప్రచార వేగాన్నిపెంచింది. అయితే తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు  సినిమా విడుదలకు ముందున్న ఆసక్తి  ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల ముందు కలగటం లేదు.

dull interest on NTR MahanayakuDu కోసం చిత్ర ఫలితం

ఎన్టీఆర్ కథానాయకుడు ధారుణ డిజాస్టర్ కావడంతో, ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఇంతేలే! అన్న తృణీకార భావం వలన  ప్రేక్షకులకు ఆసక్తి కలగడంలేదు. ఎన్టీఆర్ మహా నాయకుడు ఫిబ్రవరి 22న విడుదలవుతుందని, ఒక రోజంతా సినిమా పోస్టర్స్ తో హంగామా చేసిన ఈ సినిమా బృందం, రెండో రోజు మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్స్ తో పాటుగా, సాయంత్రానికల్లా ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేసింది.

dull interest on NTR MahanayakuDu Lakshmi's NTR కోసం చిత్ర ఫలితం

ఎన్టీఆర్ కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ అనగానే సోషల్ మీడియా మొత్తం ఆవురావురంటూ ఎదురు చూడడమే కాదు, నందమూరి అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తిని వెల్లువలా ఎగసిపడి హడా విడి చేసింది. కానీ ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ వస్తుంది అంటే, సోషల్ మీడియాలో ఎటువంటి ఆసక్తి కాని కనీస హడావిడి కాని ప్రేక్షకుల్లో కలగలేదు. అలాగే నందమూరి అభిమానులలో కొద్దిగా హడావిడి కనబడినా అది అంతగా మీడియాలో ఎక్కడా ఫోకస్ అవ్వలేదు. ఈ విషయంలో ఎందుకో పచ్చమీడియా కూడా ఉత్సాహం చూపిన దాఖలాలు కనపదలేదు.

dull interest on NTR MahanayakuDu Lakshmi's NTR కోసం చిత్ర ఫలితం

ఇక ఎన్టీఆర్ కథానాయకుడు ప్రచార చిత్రం (ట్రైలర్) చూసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కోసం నిరీక్షించారు. కాని ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ చూసాక మాత్రం అంతగా ఉత్సాహం చూకుండా అది చాలా చప్పగా ఉందంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ గా ఎంతో కొంత ఆకట్టుకుంటే, ఎన్టీఆర్ మహానాయకుడిలో రాజకీయ నాయకుడుగా బాలకృష్ణ మాత్రమే కనిపిస్తున్నాడని ఎన్టీఆర్ ఏమాత్రం కనపడలేదంటున్నారు.


ఇక  ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ మొత్తం రాజకీయాల చుట్టూనే తిప్పారు. అయితే అక్కడక్కడా ఎమోషన్, బాధ, ఉద్వేగం లాంటివి జొప్పించినా, ఎందుకో ఎన్టీఆర్ కథానాయకుడు మీద ఉన్న ఉత్సాహం ఎన్టీఆర్ మహానాయకుడు మీద జనించటం లేదన్నది వాస్తవం. అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు కేవలం మూడు రోజులే ఉన్నప్పటికీ, సినిమా మీద ప్రేక్షకుల్లోనూ ఇసుమంత కూడా ఆసక్తి కలగక పోవడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడమే ఎన్టీఆర్ మహానాయకుడుపై నెగెటివ్ ప్రభావం పడటం జరిగింది.

dull interest on NTR MahanayakuDu కోసం చిత్ర ఫలితం

అసలే ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు ముందు ప్రమోషన్స్ చాలా బలహీనంగా ఉండి, సినిమా మీద ఆసక్తి పెరగక పోవటానికి మరో కారణం దిగ్విజయం సాధించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన చిత్రం "యాత్ర" - ఆ సినిమాలో మమ్మూటి పలికించిన భావోద్వెగాలను చూసిన ప్రేక్షకులు - బయోపిక్ అంటే ఇలా ఉండాలి అన్నంత ముద్రవేశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ చూసాక మమ్మూటి నటన ముందు బాలకృష్ణ నటన పేలవంగా ఉండటమే. నందమూరి తారక రామారావు ఆత్మజుడైన నందమూరి బాలకృష్ణ వంశం, బ్లడ్, బ్రీడ్ అని అత్యంత అహభావానికి పోయి చిత్ర విజయాన్ని పాతరేశాడు. మానవులంతా ఒకటేనన్న భావనను కలిగించక తాము తమ కుటుంబమే గొప్ప అని సినిమా ద్వారా చెప్పటం ప్రజల్లో వ్యతిరేఖత పెరిగి పతనానికి పరాకాష్టగా మారిందని చెప్పొచ్చు. 

సంబంధిత చిత్రం

అయితే "యాత్ర"  సినిమాలో వైఎస్ ఆర్ కు మమ్మూటికి ఏ విధమైన సంబంధం లేకపోయినా నిజపాత్రని తనలో ఆవాహన చేసుకొని నటించటం సినిమా నిర్మాణ విలువల్ని తారస్థాయికి చేర్చింది. కాగా కావలసినంత కథా బలమున్న ఎంటీఆర్ సినిమాను కల్పితాలతో నిపేసి మానవుణ్ణి దైవ సమానుడుగా చూపటం జనం సహించలేకపోయారు. ఈ ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ లో అందరికి తెలిసిన కథను మాయజేసి మసిబూసి మారేడుకాయగా చూపబోతున్నారని జనంలో ముందే కాస్తో కూస్తో ఉన్న ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతుంది. ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయాలతో ఎంతగా సతమత మయ్యాడో చూపించిన క్రిష్, చంద్రబాబు కేరెక్టర్ ని ఎలా మలిచాడో అనేది కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ని కల్గించే అంశం.

dull interest on NTR MahanayakuDu Lakshmi's NTR కోసం చిత్ర ఫలితం

రాం గోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్ టీఆర్" ట్రైలర్ ప్రేక్షకుల అటెన్షన్ విపరీతంగా కాచ్ చేయటంతో కూడా ఎన్ టీఆర్ మహానాయకుడుపై ఆసక్తి తగ్గటానికి కారణం అని కూడా చెప్పొచ్చు. వర్మ చెప్పేది నిజమైన కథ అందులో అనుమానం లేదు. మరి ఇందులో ఖచ్చితంగా స్వకుచమర్ధనం ఉంటుందని ప్రేక్షకులు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. అందుకే ఓపెనింగ్స్ మంచిగా ఉండకపోవచ్చు. సినిమాలో క్రిష్ నిజాలు చూపితే కలక్షణ్లు ఖచ్చితంగా పుంజుకుంటాయి. జనాలు ప్రజాస్వామ్యం గుర్తించటం మొదలెట్టారు. డైనాష్టీ వేషాలకు ఇప్పుడు ఫుల్-స్టాప్ పెట్టాల్సిందే. 

dull interest on NTR MahanayakuDu Lakshmi's NTR కోసం చిత్ర ఫలితం

అయితే చంద్రబాబు పాత్ర కన్నా ఎక్కువగా, ఈ సినిమాలో నాదెళ్ల భాస్కరరావు కేరెక్టర్ హైలెట్ అయ్యేలా కనబడుతుంది. ఎన్ టీఆర్ మహానాయకుడు ట్రైలర్ చూసాక, మరి సినిమాలో కావాల్సిన పాయింట్స్-మిస్ కాకపోతే సినిమా ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. ఇక ఎన్ టీఆర్ మహాకనాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లోకి వెళ్ళాలి. లేదంటే కేవలం మూడు రోజుల్లోనే ఎన్ టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడం కష్టం. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే, మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుంది, లేదంటే కష్టం సుమీ!\

మరింత సమాచారం తెలుసుకోండి: