ఏపీ సీఎం చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారన్న విశ్వాసం ఆ పార్టీ నేతల్లో కలగడం లేదో ఏమో కానీ ఆ పార్టీ నేతలంతా వైసీపీలోకి క్యూ కడుతున్నారు. మొన్న ఆమంచి కృష్ణమోహన్, నిన్న అవంతి శ్రీనివాస్ తర్వాత ఇప్పుడు మరో ఎంపీ జంపింగ్ కు రెడీ అయ్యారు.

tdp mp pandula ravindrababu కోసం చిత్ర ఫలితం


ఆయనే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. ఈరోజు కానీ రేపు కానీ.. ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలుస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రవీంద్రబాబు ఎక్కడో ఓ చోట పోటీకి దిగుతారు. రవీంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. రవీంద్రబాబు నిర్ణయం టీడీపీకి షాక్ ఇచ్చింది.

సంబంధిత చిత్రం


ఎందుకంటే.. అవంతి శ్రీనివాస్ తో పాటే పండుల రవీంద్రబాబు కూడా వెళ్లిపోతారని టాక్ వచ్చింది. కానీ అప్పుడు రవీంద్రబాబు తాను టీడీపీలోనే ఉంటానని ప్రెస్ నోట‌్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన పార్టీ మారరేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. వారంరోజుల్లోనే ఆయన నిర్ణయం మార్చుకున్నారు.

tdp mp pandula ravindrababu కోసం చిత్ర ఫలితం


అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు... అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో రవీంద్రబాబు అసంతృప్తి చెంది.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు సర్దిచెప్పుకుంటున్నాయి. ఆయన ఎంపీ వర్గాలు మాత్రం.. ఇక టీడీపీకి ఫ్యూచర్ ఏమాత్రం లేకపోవడం వల్లే తమ నేత వైసీపీలోకి వెళ్తున్నాడని చెబుతున్నాయి. ఏదేమైనా పార్టీ మారేటప్పుడు ఇలాంటి కామెంట్లు మామూలే కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: