భారత్ పాకిస్తాన్ లు సోదర దేశాలు కలిసిమెలిసి ఉండాసిన మనం అన్యాయంగా కొట్టుకు చావటం దురదృష్టకరం. పాకిస్తాన్ లో దాదాపు సైనిక పాలనే నడుస్తూ వుంటుంది. రాజకీయం పాలన రెండూ అక్కడ సైన్యం చేతిలో కీలుబొమ్మలే. సైన్య నియంతృత్వం పుణ్యమా అని అక్కడ ప్రజలకు శాంతి సౌఖ్యాలు దశాబ్ధాలుగా కరవయ్యాయి. అలాగే పొరుగు దేశ ప్రజలకు కూడా!


ప్రస్తుతం భారత్ కాశ్మీర్లోనిక్ పుల్వామా ఉగ్ర‌దాడి వెనుక దాయాది పాకిస్థాన్ హ‌స్తం ఉన్న విష‌యం దేశంలోని చిన్న పిల్లాడి నుంచి అవ‌గాహ‌న ఉన్న విష‌య‌మే. సైన్యం వినియోగించే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన "ఆర్డీఎక్స్" భారీ మొత్తంలో ఉగ్ర‌వాదుల‌కు చేరిందంటే అందుకు పాక్ మిల‌ట‌రీ సాయం లేకుండానే జరుగుతుందా! పాక్ జన్మమిచ్చి మనపైకి తోలేసిన ఉగ్రవాద తండాలు ఇక్కడ విల్స్య్స్మ్ సృష్టిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ, ఇలాంటివేమీ ప‌ట్టించుకోకుండా, త‌న మాట‌ల‌కు ప్ర‌పంచం న‌వ్వుతుంద‌ని తెలిసి న‌ప్పటికి సిగ్గు ఎగూ లేకుండా నోటికొచ్చినట్లు అబద్ధాలూ అమాయ‌క‌పు మొహం పెట్టుకొని నటిస్తూ మాట్లాడుతున్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మాట‌లు ఇప్పుడు భారత్ లోనే ప్రపంచ వ్యాప్తంగా శాంతి ప్రియులకు గుండెల్లో దావానలం రేపుతున్నాయి.

పుల్వామా ఘ‌ట‌న: పాక్ అమ్మాయి చాలెంజ్

పుల్వామా ఘ‌ట‌న వెనుక పాక్ హ‌స్తం ఉంద‌న్న ఆధారాల్ని చూపించాల‌ని ఆయన అమాయకంగా కోరుతున్నారు. నిజంగానే ఇమ్రాన్ ఖాన్ కు అంత నిజాయితీ మానవత్వం ఉంటే, ఘ‌ట‌న జ‌రిగిన క్షణల్లోనే భారత్ కు జరిగిన అమానవీయ ఘటనకు స్పందించేవారు. భార‌త విషాదంలో తామూ మానవీయ కోణంలోనైనా పాలు పంచుకునే వారు. అందుకు భిన్నంగా రోజులు గ‌డిచిన త‌ర్వాత‌, తీరిగ్గా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన మాట‌లు చూస్తేనే ఆయ‌న దుర్మార్గపు తీరు ఏమిటో? ఇట్టే అర్థం కాక మాన‌దు.

pak women condemned pulwama terror attack కోసం చిత్ర ఫలితం

తన దుర్మార్గాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కిందా మీదా ప‌డుతున్న వేళ‌, పాక్ కు చెందిన "ఒక మ‌హిళ" భిన్నంగా స్పందించింది. పుల్వామా ఉగ్ర‌దాడిపై ఆమె క‌దిలి పోవ‌ట‌మే కాదు, హృదయం ద్రవించి క‌న్నీరు పెట్టించింది. భార‌తీయురాలు కాకున్నా, మూర్తీభ‌వించిన మాన‌వ‌త్వంతో ఆమె చేస్తున్న ప్ర‌చారం ఇప్పుడు ప‌లువురు దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఆ పాక్ అమ్మాయి పేరు ఏమిటంటారా?  ఆమె పేరు "సెహీర్ మీర్జా" ఒక జ‌ర్న‌లిస్ట్.

సంబంధిత చిత్రం

తాజా ఉగ్ర‌వాదదాడిలో పెద్ద ఎత్తున సైనికులు బ‌లి కావ‌టంపై స్పందించిన ఆమె, ఈ హృదయవిధారక ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతేకాదు, భార‌త్ కు మ‌ద్ద‌తుగాఆమె "యాంటీ హేట్ చాలెంజ్" అనే కార్యక్రమం చేప‌ట్టారు. "దేశ‌భ‌క్తి కోసం మాన‌వ‌త్వాన్ని తాక‌ట్టు పెట్టలేం" అంటూ త‌న ఫేస్-బుక్ పేజీలో రాసుకున్న ఆమె దాని కింద "తాను పాక్ అమ్మాయిన‌ని.. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లుగా ప్ల‌కార్డుతో ఉన్న ఫోటో" ను పోస్ట్ చేశారు.

anti hate challenge కోసం చిత్ర ఫలితం

భార‌త్ కు మ‌ద్ద‌తుగా చేప‌ట్టిన ఈ ప్ర‌చారంలో భాగ‌స్వామ్యం కావాల‌ని ఆమె అంద‌రిని కోరుతోంది. ఆమె స్ఫూర్తితో పాక్ లోని చాలా మంది పాకిస్థానీయులు ఆమె మార్గాన్ని అనుస‌రిస్తున్నారు. దాయాది దేశాల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ర్దుమ‌ణగాలని సంపూర్ణ శాంతి సౌఖ్యాలు నెల‌కొనాల‌ని సెహీర్ మీర్జా చాలా కాలంగా పోరాడుతున్నారు. మన శత్రువు పాకిస్తాన్ ప్రజానీకం స్పందించిన నంతగా కూడా మన రాష్ట్రాల నాయకులు దేశం కోసం స్పందించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: