తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వైపే. ఎన్టీఆర్ సినీ, రాజకీయ చరిత్రలతో బాలకృష్ణ తెరకెక్కించి, నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే బాలకృష్ణ ఆపిన చోటు నుంచే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

సంబంధిత చిత్రం

ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో తెరకెక్కించిన ప్రణయ గీతాంన్ని చేశాడు. ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అంటూ సాగే ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించగా లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్‌ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్య క్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల కానుంది.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

బయోపిక్ పెరుతో నందమూరి తారక రామారావు జీవన చిత్రాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నందమూరి ధర్మపత్ని బసవతారకం కోణంలో ఎన్ టీఆర్ జీవితాన్ని చూపారు దర్శకుడు క్రిష్. కాని కథానాయకుడు సినిమా చూసిన వారికి అందులో నందమూరి బాలకృష్ణ తన తండ్రి నటించిన పాత్రల్లో పాటలో నటించి తృష్ణ తీర్చుకోవటమే ధ్యేయంగా కనిపించింది తప్ప నందమూరిలో నటనా వైదుష్యాన్ని చూపవలసిన తీరులో చూపలేదనే చెప్పాలి. అందుకే సినిమాలో ప్రధాన భాగం రికార్డింగ్ డాన్స్ లతోనే సరిపోయింది. ఎన్ టీఆర్ పౌరాణిక నటుడుగా ఎదగటంలో ప్రతినాయక పాత్ర ధారి ఎస్వీఆర్ ను సరైన విధంగా ప్రెసెంట్ చేయకపోవటం కూడా ధారుణ అన్యాయమే. ప్రస్తుత తరానికి విశిష్ట సినిమా రానా పాత్రను వదిలెస్తే "బాహుబలి" ని ప్రభాస్ రక్తికట్తించగలడా!

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

మిగిలిన దాట్లో ఎన్టీఆర్ ను దైవంగా చూపటంలో నిమగ్నమైన నిర్మాత బాలకృష్ణ నేరానికి ఎన్టీఆర్ ని ఆరాధ్యదైవంగా భావించే ప్రేక్షకులు ₹50 కోట్ల నష్టంతో కుళ్ళి కృసించేలా లెంపకాయలేశారు. అక్కడ బాలకృష్ణ ఫినిష్.

the great NTR Picture as Krishna కోసం చిత్ర ఫలితం

బయోపిక్ కీలక పాత్రం ఎన్టీఆర్ ను వదిలేసి చంద్రబాబు నాయుడుని హీరో చేసి ఆయనకు అనుకూలంగా రామారావు జీవితాన్ని మార్చేసిన మహానాయకుడు వైపే ప్రేక్షకులు దృష్టి సారించటం లేదు. అక్కడ బాబు, బాలకృష్ణ ల ప్రమేయం జనం  ఊహించి థియేటర్ల చాయలకే పోక పోవటం ఎన్టీఆర్ వంశం రక్తం రెండింటికీ అవమానమే. ఇక బాలకృష్ణ తొడకొట్టలేడు ఖచ్చితంగా.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

నందమూరి తారక రామారావు ఏడుపదుల వయసులో లక్ష్మి పార్వతిని పెళ్ళి చేసుకోవటానికి కారణం ఆయన కడుపున పుట్టిన ఏడుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళే సమాధానం చెప్పాలి. ఏడుపదుల వృద్దాప్యంలో ఎవరూ శృంగారం కోరుకోరు కాని సానిహిత్యం ప్రేమ ఆసరా కోరుకునే వయసు లో ఆయన సంపద కీర్తి అనుభవిస్తూ కూడా ఆయన్ని వదిలేసిన వారే సమాధానం చెప్పాలి.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితంలక్ష్మి పార్వతి ఎలాంటివారైనా ఆమె దగ్గరవటానికి కారణం కుటుంబమే - అలాగే నందమూరి రాజకీయ ఆర్ధిక జీవిత పతనానికి కూడా కుటుంబమే కారణం అని చెప్పొచ్చు. అందులో కథానాయకుడు చంద్రబాబు అని కచ్చితంగా చెప్పగలం.

సంబంధిత చిత్రం

బహుశ రాంగోపాల్ వర్మ లక్ష్మి పార్వతి కోణంలో ఎన్ టీఆర్ ను చూపించాలను కున్నారు. దట్స్ గుడ్!

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ నిజంగా బాగుందా! అసలు ఏమనుకుంటున్నారు? ఎన్టీఆర్ బ‌యోపిక్‌ ను కంగ‌న ర‌నౌత్ టార్గెట్ చేస్తుందా? బ‌యోపిక్ క‌థేంటి? రామ్ గోపాల్ వ‌ర్మ‌-వీడు మామూలోడు కాడు. శ్రీరెడ్డి బయోపిక్‌ లో మెయిన్ టార్గెట్ వాళ్లేనా? దగ్గుపాటి ఫ్యామిలీపై ఫోకస్!

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

వాలెంటైన్స్ డే ను కాస్తా ఇప్పుడు త‌న సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ డే గా మార్చేసాడు వ‌ర్మ‌. ఈయ‌న సినిమా ట్రైల‌ర్ ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. విడుద‌లైన క్ష‌ణం నుంచి అద్భుతాలు చేస్తుంది ఈ చిత్ర ట్రైల‌ర్. ఒక వైపు ప్ర‌శంస‌లు, మ‌రోవైపు విమ‌ర్శ‌ల‌తో ఈ ట్రైల‌ర్ రెస్పాన్స్ అదిరిపోతుంది.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

వాలెంటైన్స్-డే ను కాస్తా ఇప్పుడు త‌న సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసి “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ డే” గా మార్చేసాడు వ‌ర్మ‌. ఈయ‌న సినిమా ట్రైల‌ర్ ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. విడుద‌లైన క్ష‌ణం నుంచి అద్భుతాలు చేస్తుంది ఈ చిత్ర ట్రైల‌ర్ ఒక వైపు ప్ర‌శంస‌లు మ‌రోవైపు విమ‌ర్శ‌ల‌తో ఈ ట్రైల‌ర్ రెస్పాన్స్ అదిరిపోతుంది. అయితే ఒరిజిన‌ల్ రియాక్ష‌న్స్ మాత్రం మ‌రోలా ఉన్నాయి. ఇందులో పూర్తిగా వ‌ర్మ వ‌న్ సైడ్ గేమ్ ఆడాడ‌ని ముందు నుంచి నిజాలు చూపిస్తాన‌ని చెప్పి ఒక వ్య‌క్తిని కావాల‌నే టార్గెట్ చేసాడ‌ని మండి ప‌డుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ముఖ్యంగా చంద్ర‌బాబును విల‌న్ పాత్ర‌లో చూపించ‌డం వాళ్ల‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.

సంబంధిత చిత్రం

ఇదిలా ఉంటే అప్ప‌ట్లో వైస్రాయ్ హోట‌ల్ ప్రత్యక్ష సాక్షులు కొంద‌రు ఇప్పటికీ ఉన్నారు. వాళ్లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే వెన్నుపోటు రాజ‌కీయాల కంటే కూడా అప్పుడు రాష్ట్రం ఉన్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు చేసిందికూడా క‌రెక్టే అంటున్నారు వాళ్లు.


అలా వాదిస్తున్న వాళ్ల‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ అస్స‌లు న‌చ్చ‌డం లేదు. కావాల‌నే వ‌ర్మ ఎవ‌రికో అమ్ముడుపోయి ఈ సినిమా తీసాడంటూ ఘాటుగానే విమ‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు ఇంకొంద‌రు మాత్రం వ‌ర్మ చాలా ధైర్యం చేసాడ‌ని, ఇలాంటి బ‌యోపిక్ చేయాలంటే ద‌మ్ము కావాల‌ని, అది వ‌ర్మ‌కు కావాల్సినంత ఉంద‌ని పొగిడేస్తున్నారు.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

ట్రైల‌ర్ నిండా ఎన్టీఆర్ వెన్నుపోటు రాజ‌కీయాల‌ను, ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న జీవితం మారిపోయిన విధానాన్ని చూపించాడు వ‌ర్మ‌. అయితే పూర్తిగా చంద్ర‌బాబును ప్ర‌తినాయకుడిగా చూపిస్తే, ఎన్టీఆర్ చ‌నిపోయిన త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మ‌రీ చంద్రబాబు ఎలా గెలిచాడు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. ఒక వేళ నిజంగానే ఎన్టీఆర్ను ఆయ‌న వెన్నుపోటుపొడిచి ఉంటే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఆయ‌న‌కే ఎందుకు ప‌ట్టం క‌డ‌తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు వాళ్లు.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

అప్ప‌ట్లో ఆడ‌పెత్త‌నం నిజంగానే ఉంద‌ని, ల‌క్ష్మీపార్వ‌తి చేతుల్లో పార్టీ బ‌లైపోతుంటే, ఎన్టీఆర్ లాంటి నాయ‌కుడిని సైతం ఆమె చేతుల్లో కీలుబొమ్మ అయిపోతే అప్పుడు చంద్ర‌బాబు కాస్త రాజ‌కీయాలుచేసి ఎన్టీఆర్ గద్దెదిగేలా చేసాడనీ కానీ అప్పుడు ఆయ‌న అలా చేసినందుకే పార్టీ ఇప్ప‌టికీ బ‌తికి ఉంద‌ని.. లేక‌పోతే నాడే తెలుగుదేశం కాస్తా ల‌క్ష్మీ తెలుగుదేశంగా మారిపోయేద‌ని కొంద‌రు బాహాటంగానే త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇవ‌న్నీ చూపించ‌కుండా కేవ‌లం చంద్ర‌బాబును టార్గెట్ చేసిన‌ట్లు ట్రైల‌ర్ ఉండ‌టంతో వ‌ర్మ‌పై మండి ప‌డుతున్నారు.

mahanayakuDu kathanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

నిజాలు చూపించే ధైర్యం ఉన్న‌పుడు అన్నీ చూపించాలి క‌దా! అవి చూపకుండా కేవ‌లం ల‌క్ష్మీపార్వ‌తి కోణాన్ని మాత్ర‌మే చూపిస్తే ఎలా అంటున్నారు. మ‌రి దీనికి వ‌ర్మ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి. ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాకు పూర్తి విల‌న్ చంద్ర‌బాబు అని అర్థ‌మైపోయింది. సినిమాలో కూడా ఇదే ఉంటుంద‌నే క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రి చూడాలిక‌ విడుద‌లైన త‌ర్వాత ఏం జ‌రుగుతుందో?

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: