పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తొలిసారి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆదేశ ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఆయన పాకిస్థాన్‌, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పాక్‌ ప్రధాని తనేసుకున్న అమాయకపు ముసుగు తొలగించి మాట్లాడాలన్నరు. 
asaduddin severely attacked imran khan and pak కోసం చిత్ర ఫలితం
‘‘కెమెరాల ముందు కూర్చొని ఇండియాకు నీతి వ్యాఖ్యాలు బోధించొద్దు. ఈ దాడి మొదటిది కాదు. ఇప్పటికే పఠాన్‌ కోట్‌, ఉరీ ఘటనలు జరిగాయి. భారత్‌ తరఫున నేను పాక్‌ ప్రధానికి ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు మీ అమాయకత్వపు ముసుగు తొలగించండి’’ అని అసదుద్దిన్ అన్నారు. భారత ముస్లింల గురించి పాక్‌ ఆలోచించనవసరం లేదని 1947లోనే భారత్‌ ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు.

“భారత దేవాలయాల్లో గంటలు మోగనివ్వం!” అని పాక్‌కు చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ దీటైన సమాధానం ఇచ్చారు. ‘‘మీకు భారత్‌కు గురించి తెలియదు. భారత్‌లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్‌, దేవాలయాల్లో గంటలు గణగణమంటూ మోగుతూనే ఉంటాయి. ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారు. దీన్ని పాక్‌ ఓర్వలేకపోతోంది’’ అని ఓవైసీ అన్నారు.
asaduddin severely attacked imran khan and pak కోసం చిత్ర ఫలితం
"భిన్నత్వంలో ఏకత్వమే ఇండియా సౌందర్యం" అని పొరుగు దేశం పాక్ కు ఇది అసూయగా ఉందని ధ్వజమెత్తారు.దేశ ప్రజలంతా ఒకటిగా జీవిస్తారని దేశం కోసం ఒకటి ముందుకు సాగుతారని ఓవైసీ పేర్కొన్నారు.

"పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్‌ఐ కలిసే పుల్వామా దాడిని జరిపాయన్నారు. “మహ్మద్‌, ఒక వ్యక్తి ప్రాణాల్ని బలితీసుకోడు అంటూ జైష్-ఏ-మహమ్మద్‌ సంస్థను జైష్-ఏ-సైతాన్‌ గా ఆయన అభివర్ణించారు. అలాగే దాడికి ఇంటెలిజెన్స్‌ లోపం కూడా ఒక కారణం" అన్నారు.

1947లో ప్రతిపాదిత దేశ విభజనను వ్యతిరేకించి ముస్లింలంతా స్వచ్ఛందంగా ఇండియాలోనే ఉండిపోయారని భిన్నత్వంలో ఏకత్వం ఇండియా విధానం అని ఓవైసీ కొనియాడారు. భారత దేశ పౌరులంతా కలిసి మెలిసి ఉండడం చూసి పాక్ కుళ్లుకుంటోందని విమర్శించారు. 

భారత దేశ పౌరుడిగా నేను చెప్తున్నానని, పుల్వామా దాడితో పాకిస్తాన్ కు లింకులున్నాయని, పాక్ సైన్యం  ఐఎస్ఐ పథకం ప్రకారమే కలసి సృష్టించి ఈ దాడి చేశాయని ఓవైసీ విమర్శించారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పాత్ర పైన ఓవైసీ విరుచుకుపడ్డారు. మహ్మద్ ను నమ్మేవారెవ్వరూ ఏ ఒక్కరిని చంపరని స్పష్టం చేశారు. జైషే అంటే సైతాన్ అని, మసూద్ సైతాన్ అంటూ పాక్ ఉగ్ర సంస్థలపై ఓవైసీ నిప్పులు చెరిగారు. 

unity in diversity quotes pertains to India by muslims కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: