ఏపీ సీఎం ఎన్నికల కసరత్తు ముమ్మరం చేశారు. ఒక్కో నియోజకవర్గం నేతలతో మాట్లాడుతూ అభ్యర్థుల ఖరారును చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆయన చీరాల నేతలతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన అనేక తప్పులు పరోక్షంగా నాయకుల ముందు ఒప్పుకున్నారు.

సంబంధిత చిత్రం


పార్టీలోకి ఆమంచి కృష్ణమోహన్ ను తీసుకుని తప్పు చేశామన్న భావంతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా ఆమంచి వల్ల టిడిపి కార్యకర్తలకు అనేక ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేసుకున్నారు. ఆమంచి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అప్పట్లో ధర్నాలు చేశామన్నారు చంద్రబాబు.

chirala tdp కోసం చిత్ర ఫలితం


2014లో మనం గెలిచాక అతను మనతో వచ్చి చేరాడు.. పార్టీ బలోపేతం కోసమే ఆమంచిని తీసుకున్నాం... అంతకుముందు అతను పెట్టిన బాధలు దిగమింగాం.. రాష్ట్రం కోసం, పార్టీ కోసం కలిసి పనిచేశాం... ఆమంచి పార్టీలో ఉండి పనులన్నీచేసుకున్నారని చంద్రబాబు నాయకులతో అన్నారు.

సంబంధిత చిత్రం


ఆమంచి పార్టీలోకి రాకపోతే మీరంతా ఎంతో ఆనందంగా ఉండేవారంటూ చంద్రబాబు తాను చేసింది తప్పే అనే రీతిలో మాట్లాడారు. ఆమంచి బైటకెళ్లి మనపార్టీని అతను విమర్శించడం బాధాకరమన్నారు. అవకాశ వాదులకు ప్రజలే బుద్ది చెబుతారు.. మీరంతా విబేధాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. బలహీనపడితే ఇబ్బందులు పడేది మనమే... యుద్ధానికి వెళ్లేటప్పుడు మీనమేషాలు లెక్కించరాదు..చీరాలలో టిడిపి జెండా ఎగరాలన్నదే మన లక్ష్యం.. చీరాలలో టిడిపి గెలుపు ఏకపక్షం కావాలి అంటూ నేతలకు ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: