కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారంటూ ఇటీవల టీడీపీ విమర్శలు జోరుగా గుప్పిస్తోంది. ఏమాత్రం అవకాశం దొరికినా ఇద్దరినీ జోడీ కడుతోంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ఇంకో కొత్త విషయం బయటపెట్టారు. కేసీఆర్ కు రావడం కుదరనందువల్లే జగన్ తన కొత్త ఇంటి గృహప్రవేశం వాయిదా వేసుకున్నారట.



ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. అపూర్వ సహోదరుల్లా, ఆత్మీయ సోదరుల్లా.. మీరూ.. జగన్ రెడ్డి మీరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం నవ్యాంధ్రపై విషం చిమ్మేందుకేనంటూ ఆరోపించారు. ఆరున్నర దశాబ్దాలుగా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల మధ్య మీరు తెలంగాణ చిచ్చు పెడితే ఆర్టికల్ 3 పేరుతో జగన్ మీకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు.



జగన్ కట్టుకున్న ఇంటి ప్రారంభోత్సవానికి మీకు రావడం కుదరకపోవడంతో వాయిదా వేసుకున్న విషయం ప్రజలకు తెలుసంటూ విమర్శించారు. జగన్ హైదరాబాదును అంటిపెట్టుకోవడం మీ ఆధ్వర్యంలో, మీ సూచనలు, సలహాల మేరకు రాష్ట్రంపై కుట్ర పన్నేందుకు కాదా అని ప్రశ్నించారు కళా వెంకట్రావు. చంద్రబాబుకి అధికారాన్ని దూరం చేసి శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని దోచుకోవడానికి జగన్ను మచ్చిక చేసుకున్నావా... అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు.

kala venkata rao tdp కోసం చిత్ర ఫలితం


ఏపీ రాష్ట్రంలోని సంపద దోపిడీ కోసమే ఇద్దరు దొంగలు ఏకమయ్యారు... దొంగ పాస్ పోర్టులతో మీరు, దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానం మొదలైంది వాస్తవం కాదా... ఏపీలో అసమర్థ నాయకత్వం ఉండాలనేది మీ ఆలోచన కాదా?.. అయితే అటు.. లేకుంటే ఇటు అనేలా ఉన్న జగన్‌కు 2019 ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ఓదార్పు నిచ్చేందుకు టీఆర్ఎస్ లో ఏ పదవి ఇవ్వదలిచారు... అంటూ సెటైర్లు వేశారు కళా.


మరింత సమాచారం తెలుసుకోండి: