ఆయన ఓ మంత్రి గారు. పాపం గత ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు పట్టుబట్టి.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆ సీనియర్ నేత ఈసారైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు.



ఇంతలోనే ఆయనకు ఓ షాక్.. సొంత తమ్ముడే వైసీపీలోకి జంప్ చేసేశాడు. ఇంతకూ ఆ మంత్రి ఎవరో చెప్పలేదు కదూ.. ఆయనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్ తగిలినట్టయింది. సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో సుధాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు.

minister somi reddy కోసం చిత్ర ఫలితం


సుధాకర్ రెడ్డితో పాటు కొంతమంది అనుచరులు కూడా పార్టీలో చేరారు. సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామ కోటారెడ్డి వైసీపీలో చేరిన కొద్దిరోజులకే ఆయన సోదరుడు కూడా పార్టీ వీడటం చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గెలుపుకు తాను కృషి చేస్తానని.. వైసీపీలో చేరిన అనంతరం సుధాకర్ రెడ్డి అన్నారు. సుధాకర్ రెడ్డి పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్న కాకాణి.. టీడీపీలో అవినీతి, అక్రమాలను సహించలేకనే నేతలు పార్టీ మారుతున్నారని అన్నారు.

సంబంధిత చిత్రం


సర్వేపల్లిలో టీడీపీ ఇప్పటికే ఉనికిని కోల్పోయిందని.. రాబోయే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే అని, ఆయన్ను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులే పార్టీని వీడుతుండటం రాబోయే ఎన్నికల్లో సోమిరెడ్డికి ప్రతికూలంగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది.

minister somi reddy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: