గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాటల్లో తీవ్రత ప్రవర్తనలో ఆమూలాగ్రం మార్పు వచ్చింది. దేశంలో ప్రధాని నుండి ప్రక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరకు అంతా తమ పదవులు వదిలేసి తనకే అధికారం అప్పగించాలని భావిస్తున్నట్లు తననే మహనీయుడన్నట్లు కీర్తించాలని తన అనుభవం మరెవరికీ లేదని దాన్ని అడ్డుపెట్టుకొని తానొక సార్వం సహా సార్వభౌముడు అన్నట్లు - మిగిలిన రాజకీయ నాయకులు ఆయన పాదాక్రాంతులు అవ్వాలని ఆయన భావిస్తూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత అప్రతిష్ఠాత్మక ఆలోచన అన్నది ఆయన గుర్తించటం లేదని వివిధ పక్షాల రాజకీయనాయకుల అభిప్రాయంగా వ్యక్తమౌతుంది.
  ktr comments on chandrababu కోసం చిత్ర ఫలితం  
కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. "చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్లు, మామ నందమూరి పెట్టిన పార్టీని స్వాధీనం చేసుకొని చంద్రబాబు పెత్తనం చెలాయిస్తున్నారు" అని తెలంగాణా రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు కు ఏనాడు  స్వయం ప్రకాశం లేదని, ఎవరినో ఒకరితో పొత్తు లేకపోతే ఆయనకు గెలుపు సాధ్యంకాదని చీల్చి చెండాడారు. 
ktr comments on chandrababu కోసం చిత్ర ఫలితం
"చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నిరీక్షిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. "మనం అక్కడకు (ఏపికి) పోవాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు పోతేనె జాబులొస్తాయని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కొత్తకోట, అలంపూర్ ప్రాంతాల వారికి కర్నూలు తది తర ప్రాంతాల వారితో చుట్టరికాలు ఉన్నాయి. ఒక మంచి మాట చెబుతారని ఇదంతా చెబుతున్నా.. చంద్రబాబుతో మనకు ఎలాంటి పంచాయతీ లేదు" అని కేటీఆర్ అన్నారు.


నిన్న సోమవారం సాయంత్రం టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భం గా మాట్లాడిన కేటీఆర్, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తమను తిడుతూనే టీఆర్‌ఎస్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 
ktr comments on chandrababu కోసం చిత్ర ఫలితం
"తెల్లారి లేస్తే చంద్రబాబు మనల్ని తిడతారు. మన పథకాలనేమో కాపీ కొడతారు. తెలంగాణ రైతుల కోసం కేసీఆర్ రెండేళ్ల కిందట రైతుబంధు పథకం ప్రారంభించారు. చంద్రబాబు దాన్ని 'అన్నదాత సుఖీభవ' పేరుతో కాపీ కొట్టారు. కేసీఆర్ ఇక్కడ కళ్యాణ లక్ష్మి అమలు చేస్తే-ఆయన అక్కడ అదే పథకానికి 'పసుపు కుంకుమ' అని పేరు పెట్టారు. మన అన్నపూర్ణ క్యాంటీన్ల పథకంలో "పూర్ణ" తీసేసి "అన్న క్యాంటీన్" పేరుతో అమలు చేస్తున్నారు" అని కేటీఆర్ అన్నారు. 
ktr comments on chandrababu కోసం చిత్ర ఫలితం
"చంద్రబాబు ఈ మధ్య ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముసుగులు తీసేసి రావాలట, తెలుగోడి సత్తా అప్పుడు చూపిస్తారట. తెలంగాణలో ఉన్నది తెలుగోళ్లు కాదా! ఇక్కద తెలుగోళ్ళు లేరా! ఇక్కడి నాలుగు కోట్ల తెలుగోళ్లు మొన్ననే ఆయన్ని వీపు పగిలేలా కొట్తి పంపించలేదా!" అని కేటీఆర్ విమర్శించారు. మరోసారి అక్కడ వీపు పగలకొడితే కాని అర్ధం కాదా! అన్న ధోరణిలో మాట్లాడారు.


కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు తమకు చేతకావని, తెలంగాణ ప్రజలు సహజంగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారని కేటీఆర్ చెప్పారు. "మేం బరాబర్ మాట్లడతాం.కుట్రలు, కుతంత్రాలు, చీకటిరాజకీయాలకు పేటెంట్ ఎవరికైనా ఉందంటే-అది చంద్రబాబుకు మాత్రమే!" అని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రి   "కిసాన్ సమ్మాన్ యోజన" పేరుతో ప్రధాని మోదీ రైతుబంధు" పథకాన్ని "అన్నదాత సుఖీభవ" పేరుతో చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు. దేశంలో రైతులకు మంచి జరిగితే సంతోషమే అని ఆయన వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: