ఈ ఉదయం పాకిస్థాన్ దళాలు భారత భూభాగంలోకి చొరబడి దాడులు చేశాయి. భారత్ మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది.   మన ఐఏఎఫ్ పైలెట్ తప్పిపోయాడు. ప్రస్తుతం మన పైలెట్ వాళ్ల అదుపులో ఉన్నట్లు పాకిస్థాన్ చెప్పుకుంటుంది.  కాగా, భారత్ పై పాక్ దళాలు చేసిన దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టాం.   ఉదయం చోటుచేసుకున్న పాకిస్తాన్ కవ్వింపులు, వాటిని తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం తీసుకున్న చర్యలపై భారత  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. 
రవీశ్ కుమార్
ఉగ్రవాదానికి వ్యతిరేక చర్యల్లో భాగంగా భారత్ నిన్న పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. భారత్ జరిపిన దాడికి పాకిస్థాన్ ప్రతి దాడి చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.  ఈ నేపథ్యంలో భారత్ భూభాగంపై పాక్ యుద్ద విమానాలతో దాడులకు పాల్పడింది. తీవ్రవాద శిబిరాలపై సైనికేతర చర్యలు తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత మిలటరీని లక్ష్యంగా చేసుకుంది. దీంతో భారత వైమానిక దళాలు పాక్‌ను సమర్థంగా తిప్పికొట్టాయి.

పాకిస్తాన్‌కి చెందిన ఎఫ్16 విమానాన్ని కూల్చివేశాయి. ఈ క్రమంలో ఐఏఎఫ్‌కి చెందిన ఓ మిగ్21 విమానం కూలిపోయింది. మరోవైపు అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత పైలట్‌ను విడిపించుకునేందుకే భారత విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా స్పందించినట్టు కనిపిస్తోంది. కాగా, ఐఏఎఫ్‌కి చెందిన ఓ పైలట్ తమ ఆధీనంలో ఉన్నాడని పాక్ ప్రకటించడం... ఈ విషయాన్ని భారత్ నిర్దారించడంతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: