భారత సైన్యం వెంట మేమున్నామని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.  బుధవారం నాడు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో 21 రాజకీయ పార్టీలు సమావేశం నిర్వహించాయి. పూల్వామా ఘటనలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు విపక్షాలు శ్రద్ధాంజలి ఘటించాయి.  భారత్‌పై పాకిస్థాన్‌ దాడిని అన్ని విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయన్నారు. పాక్‌ చేతిలో భారత పైలట్‌ చిక్కడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మన పైలట్ సురక్షితంగా ఉండాలని..రావాలని కోరుకుంటున్నామని అన్నారు.  


నాయకులు ఈ సమస్యను రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దనీ.. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని,ఐక్యతను కాపాడాలనీ రాహుల్ పిలుపునిచ్చారు.  త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా రాహుల్ చెప్పారు. భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడాన్ని విపక్షాలు ఖండించాయి.


ఇప్పుడు రాజకీయాల కోసం భద్రతను ఫణంగా పెట్టకూడదని విపక్షాలు అభిప్రాయపడ్డాయి. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో జాతి అభిమతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విపక్షాలు ప్రధానిని కోరాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: