గత కొంత కాలంగా విశాఖ రైల్వే జోన్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం  పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖ రైల్వే జోన్- ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రప్రదేశ్ పౌరులు పోరాటం చేస్తున్నారు.  ఈ విషయంలోపై  టిడిపి ఎంపిలు నిరాహార దీక్షలు కూడా చేశారు.   అయితే  విశాఖ రైల్వేజోన్ డిమాండ్ ఇప్పటి ది కాదు. ఆంధ్రులు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర పౌరులు దశాబ్దాలుగా కంటున్న కల. విశాఖకు ప్రత్యేకంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు అనేక ఆందోళనలు జరిపారు, నిరసనలు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014లో కంటి తుడుపుగా విశాఖ రైల్వే జోన్ అంశం చేర్చి మమ అనిపించింది. 

Image result for విశాఖకు రైల్వే జోన్

2014 డిసెంబర్ 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వేమంత్రిని కలిసి విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు.   ఈ నేపథ్యంలో విశాఖ ప్రత్యేక రైల్వేజోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు మంగళవారం లేఖ రాశారు. రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలతో పాటు వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ రైల్వే డివిజన్లతో ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. 


తాజాగా   విశాఖ కు రైల్వే జోన్ ప్రకటించినంది కేంద్రం.  దానికి సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేశారు.  వాల్తేరు డివిజన్ ను రాయగఢ్  కేంద్రంగా మార్చబోతున్నామని అన్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్.  విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  


ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయని పీయూష్ గోయల్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: