ఈ మద్య డబ్బు సంపాదనకోసం కొంత మంది ఏ మార్గాన్నైనా అనుసరిస్తున్నారు.  ఎదుటి వారిని మోసం చేసి ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు.  దొంగతనం, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ దందా, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాలుగా డబ్బు సంపాదిస్తున్నారు.  అయితే ఈ నేరాలు చేసిన వారు ఎప్పటికైనా పట్టుబడక తప్పదు.

తాజాగా ఎన్నో రకాల సముద్ర జీవులను దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముట గుట్టు రట్టు చేశారు కస్టమ్స్ ఆఫీసర్లు. స్మగ్లర్లు 160 కిలోల పొడి (ఎండు) సముద్ర గుర్రాలు, 111 కిలోల పాంగోలిన్ పొలుసులు, 180 కిలోల పైప్ ఫిష్, 5 కిలోల సముద్ర దోసకాయలు, ఇతర జాతుల జీవులకు చెందిన సుమారు 660 కిలోల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు స్మగ్లర్లను పోలీసులకు అప్పగించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: